ఇప్పుడు కన్నడ టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన కే వి ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి పాలు భారీ సినిమాలు కన్నడ, తమిళ్, తెలుగు నుంచి వరుసగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కన్నడలో రాకింగ్ స్టార్ యష్ నటించిన భారీ సినిమా టాక్సిక్, దళపతి విజయ్ తో చేసిన అవైటెడ్ సినిమా జన నాయగన్ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ వీరి వద్ద ఉన్నాయి.
ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు సినిమాలు చాలా ఆలస్యం అవుతూ వచ్చాయి. ఈ ఏడాది లోనే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ రెండు సినిమాలలో ఎట్టకేలకు టాక్సిక్ విడుదల తేది ఫిక్స్ చేసుకుంది. కానీ ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు సినిమాలకు ఓ కామన్ పాయింట్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇంకా ఈ రెండు సినిమాల ఓటీటీ డీల్స్ ఇంకా లాక్ కాలేదట.
అయినప్పటికీ టాక్సిక్ ని విడుదల చేస్తున్నారు కానీ జన నాయగన్ కి కూడా అనుకున్న రేంజ్ ఓటీటీ డీల్ వచ్చేస్తే దాని విడుదల కూడా ఒక కొలిక్కి వస్తుంది అని వినిపిస్తోంది. సో ఒకే నిర్మాణ సంస్థ నుంచి ఈ రెండు సినిమాలు ఓటీటీ డీల్స్ పరంగా ఒకే పరిస్థితిలో ఉన్నాయని చెప్పవచ్చు. మరి వీటిపై ఎప్పటికి క్లారిటీ వస్తుందో చూడాలి.


