కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ అలాగే హుమా ఖురేషి, తారా సుతారియాలు హీరోయిన్స్ గా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “టాక్సిక్” కోసం అందరికీ తెలిసిందే. గ్లోబల్ లెవెల్లో రిలీజ్ కి తీసుకొస్తున్న ఈ సినిమా నిర్మాత ముందే హెచ్చరిక ఇచ్చేస్తున్నారు. నిర్మాత కే ఎల్ వెంకటనారాయణ లేటెస్ట్ ఇంటర్వ్యూలో టాక్సిక్ పై అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేసారు.
టాక్సిక్ కేవలం పెద్ద వాళ్ళకి మాత్రమే అని క్లారిటీ ఇచ్చేసారు. సో చిన్న పిల్లలు, సెన్సిటివ్ వ్యక్తులు దూరంగానే ఉండాలని చెప్పాలి. ఆల్రెడీ వైలెన్స్, కొన్ని బోల్డ్ సీన్స్ పట్ల సోషల్ మీడియాలో రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. సో ఇపుడు నేరుగా నిర్మాత నుంచే టాక్సిక్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది కాబట్టి ఆడియెన్స్ ఎలాంటి ఫలితం అందిస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి రవి బాసృర్ సంగీతం అందిస్తుండగా ఈ ఆగష్టు 27న సినిమా విడుదల కాబోతుంది.
