ఈ ఏడాది పూర్తవుతూనే వచ్చే ఏడాది రానున్న సినిమాలు పలు చిత్రాల భారీ క్లాష్ ల కోసం ఇప్పుడు నుంచే మూవీ లవర్స్ నడుమ హాట్ డిస్కషన్ లు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇలా వచ్చే ఏడాది ఉన్న బిగ్గెస్ట్ క్లాష్ ఏదన్నా ఉంది అంటే అది ‘ధురంధర్ 2’ విషయంలో జరగనున్నదే అని చెప్పాలి. మార్చ్ 19న రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. అక్కడ నుంచి అసలు టెన్షన్ అందరిలో పట్టుకుంది.
అదే డేట్ లో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “టాక్సిక్” కూడా రాబోతుంది. కేజీయఫ్ సెన్సేషనల్ సక్సెస్ లు తర్వాత వస్తున్న సినిమా ఇది కావడం పైగా స్ట్రైట్ హాలీవుడ్ మార్కెట్ నే టార్గెట్ చేయడంతో ఈ సినిమా విషయంలో చాలా అంశాలు పెద్దగా మారుతూ వచ్చాయి. అయినప్పటికీ ధురంధర్ పార్ట్ 1 అందుకున్న సెన్సేషనల్ సక్సెస్ మాత్రం ఊహాతీతం.
అందుకే ఈ సినిమా పార్ట్ 2 తో క్లాష్ అంటే అది ఖచ్చితంగా రిస్క్ ఫ్యాక్టర్ అనే టాక్ గట్టిగా స్ప్రెడ్ అవుతుంది. దీనితో ధురంధర్ రేస్ లో మిగతా సినిమాలు వాయిదా వేసుకుంటే మంచిది అని బాలీవుడ్ ఫ్యాన్స్ అంటున్నారు. కానీ యష్ సినిమా మాత్రం ఎక్కడా తగ్గే సూచనలు చూపించడం లేదు. మెయిన్ గా ధురంధర్ 2 తో క్లాష్ కి రావద్దు అనే కామెంట్స్ కి వీరు నైస్ గా అదే రోజున వస్తున్నట్టు కన్ఫర్మ్ చేస్తున్నారు. సో క్లాష్ ఉన్నా వెనక్కి తగ్గేదే లేదని తాను చెబుతున్నారు.
Bring it on! ????#TOXIConMarch19th #TOXIC #ToxicTheMovie
— TOXIC (@Toxic_themovie) December 27, 2025
