అఫీషియల్: క్రేజీ పోస్టర్ తో యష్ ‘టాక్సిక్’ కొత్త విడుదల తేది వచ్చేసింది.!

అఫీషియల్: క్రేజీ పోస్టర్ తో యష్ ‘టాక్సిక్’ కొత్త విడుదల తేది వచ్చేసింది.!

Published on Jun 21, 2026 1:58 PM IST

Toxic-Movie

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కీయారా అద్వానీ, రుక్మిణి వసంత్ తదితర స్టార్ హీరోయిన్స్ కలయికలో గీతూ మోహన్ దాస్ అనే దర్శకురాలితో చేసిన అవైటెడ్ భారీ సినిమానే టాక్సిక్. అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ ఈపాటికే విడుదల కావాల్సి ఉంది. కానీ అనేకసార్లు వాయిదా పడడంతో ఉన్న ఇంట్రెస్ట్ కూడా చాలా మందిలో తగ్గింది.

కానీ యష్ ఫ్యాన్స్ కి మళ్లీ కిక్ ఇచ్చేలా ఒక సూపర్ పోస్టర్ తో మేకర్స్ బిగ్ అప్డేట్ అందించారు. అందరూ ఊహించినట్టే ఆగస్ట్ లో ఈ సినిమా రిలీజ్ కి తీసుకొస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఆగస్ట్ 26న గ్రాండ్ గా ఈ సినిమా వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో ఆ రోజున యష్ బాక్సాఫీస్ ని టేకోవర్ చేయనున్నారు అని చెప్పాలి. ఇక ఆ డేట్ లో ప్లాన్ చేసుకున్న సినిమాలు పోటీకి వస్తాయో లేదో అనేది చూడాలి. ఇక ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందించారు. అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్, యష్ కలిసి నిర్మాణం వహించారు.

తాజా వార్తలు