Toxic Release : యశ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. లాంగ్ వీకెండ్‌ను టార్గెట్ చేసిన ‘టాక్సిక్’ మేకర్స్!

Toxic Release : యశ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. లాంగ్ వీకెండ్‌ను టార్గెట్ చేసిన ‘టాక్సిక్’ మేకర్స్!

Published on Jun 21, 2026 1:00 PM IST

Toxic

ముఖ్య అంశాలు

  • శాండల్‌వుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’ రిలీజ్ డేట్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్ బయటికొచ్చింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
  • రిలీజ్ డేట్‌కు సంబంధించి నేడు అధికారిక ప్రకటన రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది.
  • గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషీ లాంటి భారీ స్టార్ కాస్ట్ నటిస్తున్నారు.

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. శాండల్‌వుడ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలపై ఇన్నిరోజులు ఉన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడబోతోంది. వరుస వాయిదాలతో అభిమానుల్లో తలెత్తిన నిరాశను దూరం చేస్తూ, మేకర్స్ ఒక సాలిడ్ రిలీజ్ డేట్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ యాక్షన్ డ్రామాను 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ కలిసి వచ్చేలా పక్కా ప్లానింగ్‌తో ఈ డేట్‌ను ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. మొదటి వీకెండ్‌లోనే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించడానికి ఈ తేదీ బాగా ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. కాగా, ఈ రిలీజ్ డేట్‌కు సంబంధించి నేడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తోంది. మేకర్స్ నుంచి కనుక ఈ అనౌన్స్‌మెంట్ వస్తే ఫ్యాన్స్‌కు ఇక పండగే.

ఇక ప్రమోషన్స్ విషయంలో కూడా టీమ్ స్పీడ్ పెంచబోతోంది. సినిమా పై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నప్పటికీ, వాయిదాల వల్ల కాస్త తగ్గిన బజ్‌ను తిరిగి పెంచేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. థియేట్రికల్ రిలీజ్ నాటికి రికార్డు స్థాయి క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా ఓ భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను ప్లాన్ చేస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ రేంజ్ మామూలుగా లేదు. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణీ వసంత్, హుమా ఖురేషీ, తారా సుతారియా లాంటి అగ్రశ్రేణి హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తుండటం సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేసింది. దీనికి తోడు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అందిస్తున్న నేపథ్య సంగీతం సినిమాకు మరో హైలైట్‌గా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఆగస్టు నెలాఖరులో బాక్సాఫీస్ దగ్గర యశ్ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు