యాత్ర విడుదలతేది ఖరారు !

యాత్ర విడుదలతేది ఖరారు !

Published on Sep 13, 2018 6:00 PM IST

Yatra2

మహి వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత నేత ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర తో తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇక ఈ చిత్రం మొదట్లో సంక్రాంతి కానుకగా విడుదలకానుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అంత కన్నా ముందు గానే ప్రేక్షకుల ముందుకురానుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వై ఎస్ జగన్ పుట్టిన రోజు సందర్బంగా డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదలకానుంది.

జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్, అనసూయ, సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈచిత్రానికి కృష్ణ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు