అజిత్ హీరోగా గౌతం మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తెలుగులో ‘ఎంతవాడు గానీ’ అనే టైటిల్ తో విడుదలకానుంది. ఈ సినిమా 3రోజుల షూటింగ్ మినహా మిగిలిన భాగాన్ని పూర్తిచేసుకున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ లో చెన్నై పరిసర ప్రాంతాల దగ్గర కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ ని తెరకెక్కించనున్నారు. హైదరాబాద్ లో రెండు రోజుల షూటింగ్ తరువాత చిత్ర బృందం ఇటీవలే చెన్నై చేరుకుంది
అజిత్ ని తన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చం అదే విధంగా ఒక స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ ని రూపొందించినట్టు గౌతంమీనన్ తెలిపారు. అనుష్క, త్రిష హీరోయిన్స్. ఏ.ఎం రత్నం నిర్మాత. హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు


