ఎన్టీఆర్ సమకాలీకుడి బయోపిక్‌కు కూడా రంగం సిద్ధం అవుతుంది !

Published on Jul 26, 2018 3:24 pm IST

తెలుగు చిత్రాల్లో అనేక సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలకు జీవం పోసిన ‘ఎన్టీఆర్ ఏఎన్నార్’ల సమకాలికుడు, సమ నాయకుడు అయిన కాంతారావుగారి బయోపిక్ కు రంగం సిద్ధం అవుతుంది. చంద్రాదిత్య ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పై ఈ బయోపిక్‌ను రూపొందించబోతున్నట్లు దర్శకుడు డాక్టర్‌ పి.సి.ఆదిత్య తెలిపారు. నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన కాంతారావుగారు మొత్తం 400 పైగా చిత్రాల్లో నటించారు.

కాగా నిజానికి కాంతారావుగారు ‘ఎన్టీఆర్ ఏఎన్నార్’లకు సమకాలికులుగా కొన్ని చిత్రాల్లో అయితే వారితో పాటు సమానమైన గుర్తింపును కూడా పొందారు. కానీ ఆ తర్వాత నిర్మాతగా మారి సొంతంగా చిత్రాలు నిర్మించి ఆర్ధికంగా చితికిపోయారు.మొదటి తరం హీరోగా పేరుప్రఖ్యాతలు సంపాదించిన ఆయన చివరి దశలో చిన్నచితకా పాత్రలు కూడా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బయోపిక్ లో కాంతారావుగారు సాధించిన విజయాలు, ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆయన ఎదుగుదలకు అడ్డుపడిని వ్యక్తులను ఇలా ఈ చిత్రంలో మొత్తం చూపించనున్నారట.

ఐతే ప్రస్తుతం ‘చీకటి వెలుగుల సంగ్రామం – చిత్రసీమలో నీ పయనం- కాంతారావు నీ కీర్తికి అంతంలేదు’ అనే టైటిల్‌ సాంగ్‌ ను చిత్రబృందం యూ ట్యూబ్‌ లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలకమైన పాత్రల కొరకు ఆడిషన్స్‌ జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :