మణిరత్నం రూపొందించిన ‘రోజా’, శంకర్ డైరెక్ట్ చేసిన ‘జెంటిల్మెన్’ వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అనే హోదాను దక్కించుకున్న అలనాటి నటి మధూబాల తమిళం,మలయాళం, హిందీ, తెలుగు భాషలో కథానాయకిగా అనేక చిత్రాలు చేసి కొన్నేళ్ల క్రితం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ఈ మధ్యే ఆమె తెలుగులో ‘సూర్య వెర్సెస్ సూర్య, నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాల్లో కూడ పలు కీలక పాత్రల్లో నటించారు.
ప్రస్తుతం ఈమె తమిళ నటుడు బాబీ సింహ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘అగ్ని దేవ’ అనే సినిమాలో నటిస్తోంది. కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో ఆమె భిన్నమైన విలన్ పాత్ర చేయనుందని తెలుస్తోంది. ఇలా నెగిటివ్ పాత్రలో కనిపించడం ఆమెకిదే తొలిసారి. ఈ చిత్రాన్ని జై ఫిల్మ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జాన్ పాల్ రాజ్, శామ్ సూర్యలు డైరెక్ట్ చేస్తున్నారు.
- నాని సినిమాలో ‘ఆర్ ఎక్స్ 100’ !
- క్రైమ్ కామెడీ నేపథ్యంలో వినూత్నంగా !
- డార్క్ కామెడీ సినిమాకి సెన్సార్ అయింది !
- అఖిల్ ఆ డైరెక్టర్ తో ఫిక్స్ అయినట్లే !
- ఇంటర్వ్యూ : రాయ్ లక్ష్మీ – ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ మంచి కామెడీ ఎంటర్టైనర్ !