
నట సింహం సందమూరి బాలకృష్ణ తన ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథతో, అభిమానులను మెప్పించడానికి ‘డిక్టేటర్’ అనే టైటిల్ తో తన 99వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర టీం లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. గత కొద్ది రోజులుగా బాలకృష్ణ, అంజలి మరియు ఇతర తారాగణంపై వచ్చే కొన్ని నైట్ ఎపిసోడ్ సీన్స్ ని షూట్ చేసారు. ఈ సినిమాలో బాలకృష్ణ టాలీవుడ్ న్యూ విలన్ కబీర్ దుహన్ సింగ్ తో ఢీ కొట్టనున్నాడని ఇది వరకే తెలియజేశాం.
తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ మరో యంగ్ విలన్ తో కూడా ఈ సినిమాలో ఢీ కొట్టనున్నాడు. హార్ట్ ఎటాక్, రుద్రమదేవి సినిమాల్లో కనిపించిన విక్రంజీత్ కూడా ఈ సినిమాలో ఒక విలన్ గా కనిపించనున్నాడు. వీరందరికీ మెయిన్ విలన్ గా రేసు గుర్రం ఫేం రవి కిషన్ కూడా కనిపించనున్నాడు. శ్రీవాస్ కంటిన్యూ షెడ్యూల్స్ తో సినిమాని డిసెంబర్ కల్లా ఫినిష్ చేసి 2016 సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాని రిలీజ్ చెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.
బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సాంగ్ కి సూపర్బ్స్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీవాస్ – ఎరోస్ ఇంటర్నేషనల్ వారు కలిసి నిర్మిస్తున్నారు. తమన్ అందించిన మ్యూజిక్ ని డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నాడు.

