స్వతహాగా తమిళ అమ్మాయి, కానీ ఫస్ట్ బిగ్గెస్ట్ బ్రేక్ మరియు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నది మాత్రం తెలుగులో, అంతే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది సమంత. ఇలా రచ్చ గెలిచిన సమంత ఇంట గెలవడంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే గత ఏడాది నుంచి తెలుగులో తక్కువగా తమిళంలో ఎక్కువగా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే సూర్య, విజయ్, విక్రమ్ సినిమాలలో నటించిన సమంత ప్రస్తుతం ధనుష్ సరసన ‘విఐపి 2’ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది.
ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సమంత మరో తమిళ స్టార్ సరసన మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. ఆ హీరో మరెవరో కాదు ఇప్పుడు తను ఓ సినిమా చేస్తున్న ధనుష్ కావడం విశేషం. విఐపి 2 పూర్తికాకముందే ధనుష్ తో మరో సినిమాకి సైన్ చేయడం విశేషం. నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి ‘వాడా చెన్నై’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. సౌత్ చెన్నై బ్యాక్ డ్రాప్ లో ఓ గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో రానున్న ఈ సినిమాని సెప్టెంబర్ లో స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాకి ధనుష్ సరసన సమంతని ఫైనలైజ్ చేసారు. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేయనున్నారు. ఇదిలా ఉంటే ‘S/O సత్యమూర్తి’ సినిమా తర్వాత సమంత మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’లో నటించనుంది.


