తమిళంలోకి వెళ్ళిన మరో తెలుగు భామ

తమిళంలోకి వెళ్ళిన మరో తెలుగు భామ

Published on Oct 23, 2015 6:58 PM IST

EESha
ఒకప్పుడు తెలుగు హీరోయిన్స్ ఎక్కువ ఉండేవారు, మధ్యలో అసలు తెలుగు హీరోయిన్స్ లేకుండా పోయారు.. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కాదు గానీ చిన్న హీరోల సరసన తెలుగు హీరోయిన్స్ కనిపిస్తున్నారు. అలా వచ్చిన తెలుగు భామలు మొదట మాతృ భాషలో తన సత్తా చాటుకొని ఆ తర్వాత తమ టాలెంట్ తో పరాయి భాషల్లో కూడా రాణిస్తున్న హీరోయిన్స్ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది. కలర్స్ స్వాతి మొదటగా ఇక్కడి నుంచి తమిళంకి వెళ్లి అక్కడ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది, అదే బాటలోనే బిందు మాధవి, శ్రీ దివ్య, హసిక, వితిక షేరు, రేష్మ రాథోర్, మాధవీ లతా, రీతు వర్మల తర్వాత ఇప్పుడు మరో తెలుగు భామ తమిళ్లో సత్తా చాటుకోనుంది.

అంతక ముందు ఆ తరువాత సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగమ్మాయి ఈశ. ఇప్పుడు ఈ భామకి తమిళంలో ఓ ఆఫర్ వచ్చింది. ఈశ సినిమాలు చూసిన డైరెక్టర్ మార్కస్ తన సినిమాలో హీరోయిన్ గా ఈశని సెలక్ట్ చేసాడు. న్యూ లవ్ స్టొరీగా రూపొందనున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం ఈశ తమిళ్ నేర్చుకుంటోంది. ఈ సినిమానే కాకుండా మరో తమిళ సినిమాకి కూడా ఈశ సైన్ చేయడం విశేషం. ఒకేసారి రెండు తమిళ సినిమాలకు సైన్ చేసిన ఈశ ఈ రెండు సినిమాలు తనకు మంచి బ్రేక్ ఇస్తాయని ఆశిస్తోంది.

తాజా వార్తలు