ఎన్.టి.ఆర్ సినిమాలో ఊహించని ట్విస్ట్

ఎన్.టి.ఆర్ సినిమాలో ఊహించని ట్విస్ట్

Published on Apr 13, 2015 5:19 PM IST

ntr-agapathi-babu-sukumar
‘టెంపర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్దమవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ చేయనున్న నెక్స్ట్ మూవీ ఏప్రిల్ చివర్లో అబ్రాడ్ లో మొదలు కానుంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ఈ సినిమా కోసం తన లుక్ ని మార్చుకునే పనిలో ఉన్నాడు. ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని ఇది వరకే తెలియజేశాం.

ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి ఫాదర్ పాత్రలో జగపతి బాబు కనిపించనున్నాడని ఇదివరకే తెలియజేశాం. కానీ తాజాగా వినిపిస్తున్న ట్విస్ట్ ఏమిటంటే.. జగపతి బాబు ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. జగపతి బాబు ఎన్.టి.ఆర్ ఫాదర్ లానే కనిపిస్తూ నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తాడా లేక పూర్తిగా నెగటివ్ రోల్ చేస్తాడా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు