రెండో సినిమాకే ఆ హీరోయిన్.. !

Published on Mar 7, 2019 9:01 pm IST

టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న పరభాషా నటీమణులు ఈ మధ్య తెలుగు మీద మమకారం పెంచుకుంటున్నట్లు ఉన్నారు. తమ పాత్రకు తెలుగులో తామే డబ్బింగ్ చెప్పుకుంటూ తెలుగు దర్సకనిర్మాతలతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటున్నారు. ఈ కోవలోకి సాయిపల్లవి, అనుపమా పరమేశ్వన్, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, కీర్తి సురేష్‌, స‌మంత‌, అను ఎమ్మాన్యుయేల్, రెజీనా వంటి తారలు చాలామందే వస్తారు.

తాజాగా మరో టాలెంటెడ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. అది కూడా కేవలం రెండో సినిమా నుంచే కావడం విశేషం. తన మొదటి సినిమా ‘హలో’ మూవీలో అఖిల్ సరసన నటించి నటనపరంగా మొదటి సినిమాతోనే బాగా ఆకట్టుకున్నకళ్యాణి ప్రియదర్శిని, తన రెండో సినిమా సాయి ధరమ్ తేజ్ సరసన ‘చిత్రలహరి’లో నటిస్తోంది.

‘నేను శైలజ’ ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్య క్రమాల్లో ఉంది. కళ్యాణి ప్రియదర్శిని ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శనితో పాటు మరో హీరోయిన్ నివేత పేతురాజ్ కూడా నటిస్తోంది.

కాగా ఈ సినిమా ఏప్రిల్ 12వ తేదీన విడుదల కానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సక్సెస్‌ఫుల్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై రూపొందిస్తున్నారు. సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :

More