
మాస్ మహారాజ్ రవితేజ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే సినిమా ‘కిక్’. ఆ సినిమాలో నువ్వా నేనా అంటూ పోటీపడి నటించి సినిమా విజయానికి తనూ ఓకే కారణమైన నటుడు శ్యామ్. ఆ సినిమాతో కిక్ ని తన ఇంటి పేరుగా మార్చుకున్న కిక్ శ్యామ్ ఊసరవెల్లి, రేసు గుర్రం సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించి అందరినీ మెప్పించాడు. ఇప్పుడు రవితేజ తదుపరి సినిమాకి కూడా కిక్ శ్యామ్ ని ఎంపిక చేసారు. రవితేజ నెక్స్ట్ ఫిల్మ్ ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఉంటుంది.
ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర టీం ఈ సినిమాలో రవితేజని ఢీ కొట్టే విలన్ పాత్ర కోసం కిక్ శ్యామ్ ని ఫైనలైజ్ చేసారు. రవితేజ లెక్చరర్ గా కనిపించనున్న ఈ సినిమాకి ఎవడో ఒకడు అనే టైటిల్ ని అనౌన్స్ చేసారు. ఇద్దరు హీరోయిన్స్ ఉండే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ని సెలక్ట్ చేయగా, రెండవ హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా నవంబర్ చివర్లో సెట్స్ పైకివెళ్లనుంది .
ఇది కాకుండా సంపత్ నంది డైరెక్షన్ లో రవితేజ, తమన్నా, రాశీఖన్నాలు నటించిన బెంగాల్ టైగర్ సినిమా నవంబర్ 27న రిలీజ్ కానుంది.

