పూర్తయిన ఎవడు ప్యాచ్ వర్క్

Published on Jul 21, 2013 8:43 pm IST

YEVADU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెన్సార్ జరుపుకోనుంది. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సాయి కుమార్, రాహుల్ దేవ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రామ్ చరణ్ – శృతి హాసన్ పై జూన్ చివర్లో ఓ పాటని, జులై మొదట్లో ఓ పాటని చిత్రీకరించారు.

తాజాగా శృతి హాసన్ పై కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ ని షూట్ చెయ్యడంతో ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ అతిధి పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా సెకండాఫ్ లో చాలా ట్విస్ట్ లు ఉంటాయని, సీట్లలో నుంచి కదలకుండా చూసే యాక్షన్ ఎంటర్టైనర్ అవుతుందని అంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించగా, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం :