నితిన్ సినిమాపై వస్తున్న వార్తల్ని నమ్మొద్దంటున్న దర్శకుడు !

Published on Jul 2, 2018 2:41 pm IST

హీరో నితిన్ ప్రస్తుతరం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుములతో ఒక సినిమా చేయనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ‘భీష్మ’ అని, షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని టైటిల్ లోగో పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తోంది.

దీనిపై స్పందించిన వెంకీ కుడుములు అది అసలైన లోగో కాదని, ఫేక్ వార్తల్ని నమ్మొద్దని, బెస్ట్ వర్క్ కావాలంటే కొంత సమయం పడుతుందని, త్వరలోనే అన్ని వివరాల్ని అధికారికంగా వెల్లడిస్తానని అన్నారు. ఈ చిత్రంలో నితిన్ కు జోడీగా హన్సిక నటించనుందనే వార్త కూడ ప్రచారంలో ఉంది. మరి అసలైన వివరాలు ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :