పవన్ కళ్యాణ్ మూవీలో సంజనకి బంపర్ ఆఫర్

పవన్ కళ్యాణ్ మూవీలో సంజనకి బంపర్ ఆఫర్

Published on Nov 23, 2015 4:16 PM IST

saddar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అన్ని పనులను పక్కన పెట్టి అనుకున్న టైంకి సినిమాని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ పైనే తన పూర్తి ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గుజరాత్ లోని వడోదరలో జరుగుతోంది. ఇటీవలే హీరోయిన్ కాజల్ అగర్వాల్, కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. వీరిపైన కొన్ని కామెడీ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో లక్ష్మీ రాయ్ ఓ పాటలో కనిపించడమే కాకుండా ఓ కీ రోల్ లో కనిపించనుందని ఇదివరకే తెలియజేశాం.

తాజా సమాచారం ప్రకారం ‘బుజ్జిగాడు’ ఫేం సంజనని సర్దార్ గబ్బర్ సింగ్ లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఫైనల్ చేసారు. సంజన పాత్ర సినిమాలో కనిపించేది తక్కువ అయినప్పటికీ ఆ పాత్ర సినిమాకి చాలా ప్రధానం అని, అలాగే త్వరలోనే తనపై వచ్చే సీన్స్ ని షూట్ చేస్తారని ఈ చిత్ర టీం అంటోంది. పవన్ కళ్యాణ్ సినిమాలో చాన్స్ రావడంతో సంజన తెగ సంబరపడిపోతోంది. పవర్ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా సమ్మర్ కానుకగా మేలో రిలీజ్ కానుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు