‘ఎన్టీఆర్ బయోపిక్’లో ‘యంగ్ ఏఎన్నార్’ ?
Published on Jun 24, 2018 12:44 pm IST

‘నటరత్న, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’ ఎన్టీఆర్ జీవితకథను దర్శకుడు క్రిష్ తెరకెక్కించబోతున్న విషయం తేలింసిదే. బాలకృష్ణ నటించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫైనల్ స్క్రిప్ట్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 5 నుంచి షూటింగ్ కి వెళ్లనుంది. దర్శకుడు క్రిష్ బయోపిక్ లోని ముఖ్యమైన పాత్రల కోసం ఇప్పటికే కొందరు నటులను ఫైనల్ చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి సతీమణి బసవతారకంగారి పాత్రలో విద్యాబాలన్, ఏపీ సీఎం చంద్రబాబు పాత్రలో రానా, నాదండ్ల భాస్కరరావు పాత్రలో బోమన్ ఇరానీ నటించనున్నారని సమాచారం.

మరి ఎన్టీఆర్ గారి జీవితంలో మరో ముఖ్యమైన పాత్ర ఆయన సమకాలికులైన అక్కినేని నాగేశ్వరరావుగారిది. ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావుగారితో కలిసి ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. ఇద్దరు చివరి దశ వరకు కలిసి ప్రయాణించారు. మంచి చెడ్డలను కలిసి పంచుకున్నారు. అందుకే ఎన్టీఆర్ గారి బయోపిక్ లో నాగేశ్వరరావుగారిది ప్రధానమైన పాత్ర. ఇప్పుడు ఆ పాత్రలో నాగ చైతన్యను నటింపజేయాలని దర్శకనిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే మహానటిలో నాగేశ్వరరావుగారి పాత్రలో నటించి ‘యంగ్ ఏఎన్నార్’ అనిపించుకున్న నాగచైతన్య మరోసారి తాతగారి పాత్రలో కనిపించి అక్కినేని అభిమానులను అలరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • 6
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook