‘ఇస్మాట్ శంకర్’లో ‘యంగ్ బ్యూటీ’ వినూత్నంగా !

‘ఇస్మాట్ శంకర్’లో ‘యంగ్ బ్యూటీ’ వినూత్నంగా !

Published on Feb 17, 2019 11:58 PM IST

ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఇస్మాట్ శంకర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరూ హీరోయిన్స్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

కాగా ఇందులో నభా నటేష్ క్యారెక్టర్ వినూత్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంటే పూరి మాములుగా తన సినిమాల్లో హీరోలకు రాసే క్యారెక్టరైజేషన్ ను ఈ సారి హీరోయిన్ కి రాశాడట. దాంతో ఆమె పాత్ర చాలా కొత్తగా అనిపిస్తోందట. కాకపోతే నభా పాత్ర సినిమాలో కొద్ది సేపు మాత్రమే ఉంటుందని సమాచారం.

ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు