ఆర్ఆర్ఆర్ లో యంగ్ కమీడియన్ !

Published on Dec 1, 2018 10:54 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్ ). ఇటీవలే ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ప్రాంభమైన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్లపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ‘అర్జున్ రెడ్డి’ తో గుర్తింపు తెచ్చుకున్న యువ కమెడియన్ రాహుల్ రామ కృష్ణ ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.

సుమారు 300కోట్ల భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డివివి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈచిత్రం 2020లో ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :