చాలా కాలం తరువాత ‘గరుడ వేగ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న నూతన చిత్రం ‘కల్కి’. అవె ఫెమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హాస్య నటుడు రాహుల్ రామ కృష్ణ నటిస్తున్నారు.
1983లో జరిగిన మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ను ప్రకటించాల్సి వుంది. ఇక గరుడవేగ చిత్రం తరువాత రాజశేఖర్ ఈ చిత్రంలో మరోసారి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ, రాజశేఖర్ కలయికలో వస్తున్న ఈ చిత్రం ఫై మంచి అంచనాలు వున్నాయి.
