కమల్ తో ఒకేసారి నాలుగు సినిమాలా??

కమల్ తో ఒకేసారి నాలుగు సినిమాలా??

Published on Apr 13, 2015 10:37 PM IST

Ghibran

లోకనాయకుడు కమల్ హాసన్ తో కలిసి పనిచెయ్యాలని సౌత్ ఇండస్ట్రీకి వచ్చిన ప్రతీ ఒక్కరూ కల కనడం సర్వసాధారణం. అయితే ఈ కలను సంగీత దర్శకుడు ఘిబ్రన్ ఒకేసారి నాలుగు అవకాశాల ద్వారా నిజం చేసుకున్నాడు. అవును కమల్ నాలుగు సినిమాలకు ఘిబ్రన్ ఒకేసారి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ముందుగా కమల్ కలల ప్రాజెక్ట్ ‘విశ్వరూపం 2’ ప్రాజెక్ట్ లో చెయ్యి కలిపిన ఘిబ్రన్ ఆ తరువాత ఉత్తమ విలన్, దృశ్యం తమిళ రీమేక్ పాపనాశం సినిమాలకు ఖరారయ్యాడు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం కమల్ మరో యాక్షన్ థ్రిల్లర్ ‘ఆర్ ఇరవు’ సినిమాకు కూడా ఎంపికయ్యినట్టు సమాచారం. మారిషస్ లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగులో ఘిబ్రన్ రన్ రాజా రన్ మరియు జిల్ సినిమాలకు మంచి సంగీతాన్ని అందించి పేరు తెచ్చుకున్నాడు.

తాజా వార్తలు