ఓటిటి సహా సినిమాల స్ట్రాంగ్ లైనప్ తో “జాంబీ రెడ్డి” దర్శకుడు.!

Published on May 18, 2021 12:25 pm IST

మన టాలీవుడ్ నుంచి తన సినిమాలతో నేషనల్ లెవెల్లో షైన్ అవుతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ. తన మొదటి సినిమాతోనే జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యంగ్ దర్శకుల్లో ఒకడిగా మారాడు. మరి లేటెస్ట్ గా తెలుగులోనే కాకుండా ఇండియన్ సినిమాలోనే జాంబీ కాన్సెప్ట్ తో సినిమా తీసి హిట్ కొట్టాడు. మరి అలాంటి ఈ దర్శకుడు తన ఫ్యూచర్ లో కూడా పలు ఆసక్తికర సినిమాలు సహా ఓటిటిలో సత్తా చాటేందుకు రెడీగా ఉన్నాడు.

తన ప్రతీ సినిమాకు జానర్ మార్చేసే ప్రశాంత్ ఇప్పుడు ఓటిటిలో అడుగు పెడుతున్నాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఓ వెబ్ సిరీస్ కు గాను తాను కథ అందించాడట కానీ దాన్ని వేరే దర్శకుడు హ్యాండిల్ చేస్తున్నాడు. అలాగే 90 శాతం పూర్తి కాబడిన ఈ సిరీస్ అనంతరం తెలుగు మరియు హిందీలో మరో రెండు వెబ్ సిరీస్ లు చేస్తున్నాడట. ఇక వీటి తర్వాత తన కొత్త సినిమా ఓ స్టార్ హీరోతో అనౌన్స్ చేసే అవకాశం ఈ కోవిడ్ అనంతరం ఉందని తెలిపాడు.

అలాగే తన ఇంట్రెస్టింగ్ చిత్రాలు “అ!”, “జాంబీ రెడ్డి” చిత్రాలు సీక్వెల్స్ కూడా ఉన్నాయట కానీ జాంబీ రెడ్డి కన్నా ముందు అ! సీక్వెల్ స్టార్ట్ కానుందట. అలాగే తాను ఒక సోషియో ఫాంటసీ సబ్జెక్టుపై గత పదేళ్ల నుంచి వర్క్ చేస్తున్నానని అది కూడా సాధారణంగా హ్యాండిల్ చెయ్యగలిగే సబ్జెక్టు కాదని ప్రస్తుతం అయితే తన ప్రతి చిత్రానికి కొంత అనుభవం నేర్చుకుంటున్నాని ప్రశాంత్ వర్మ తెలిపాడు. ఇలా మొత్తానికి ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సాలిడ్ లైనప్ తో రెడీగా ఉన్నాడు. మరి ఈ ట్రీట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :