‘ఆనంద్ దేవరకొండ’కి ఆ కథ బాగా నచ్చిందట !

Published on Apr 7, 2020 12:00 am IST

‘విజయ్ దేవరకొండ’ కేవలం తన యాక్టింగ్ అండ్ ఆటిట్యూడ్ తోనే స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సెన్సేషనల్ హీరో తమ్ముడిగా ‘దొరసాని’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ‘ఆనంద్ దేవరకొండ’. అయితే ఆనంద్ మాత్రం రెండవ సినిమా చేస్తూనే.. మూడవ సినిమాకు కూడా సైన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ బేస్డ్ కథగా ఉంటుందట.

షార్ట్ ఫిలిం మేకర్ దామోదర అట్టాడ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ ఆనంద్ దేవరకొండకు బాగా నచ్చిందట. ఈ ప్రాజెక్ట్ పట్ల తాను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని, అందులో పాత్ర తనకు ఛాలెంజింగ్‌గా ఉండబోతుందని చెబుతున్నాడు. టాంగా ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మొత్తానికి ఆనంద్ ఏదో భిన్నమైన కథనే చేయబోతున్నాడన్నమాట. మరి తన అన్నయ్య సపోర్ట్ తో వస్తోన్న ఈ విలువైన అవకాశాలని ఆనంద్ దేవరకొండ ఈ సారైనా సద్వినియోగ పరుచుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More