యంగ్ ఎమ్మెల్యేగా యంగ్ హీరో ?

Published on Aug 10, 2020 8:15 am IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమాలో యంగ్ హీరో నవీన్ చంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో నవీన్ చంద్ర క్యారెక్టర్ ఒక యంగ్ ఎమ్మెల్యే క్యారెక్టర్ అట. కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని కూడా తెలుస్తోంది. ఇక నవీన్ చంద్ర, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు, ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఈమేజ్ తెచ్చుకున్న న‌వీన్ చంద్ర హీరోగా తెర‌కెక్కిన సినిమా భానుమ‌తి రామ‌కృష్ణ‌ ఇటివలే ఆహాలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమాలో న‌వీన్ స‌ర‌స‌న స‌లోని లూత్రా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాను య‌శ్వంత్ ములుకుట్ల నిర్మించారు. ఓ ఇండిపెండిట్ వెబ్ ఫిల్మ్ గా భానుమ‌తి రామ‌కృష్ఱ రూపొందించ‌డం జ‌రిగింది. ఈ సినిమాకు శ్రీకాంత్ నాగోతి ద‌ర్శ‌కుడు.

సంబంధిత సమాచారం :

More