తన రెండు చిత్రాలపై నమ్మకం వ్యక్తం చేస్తున్న యువహీరో

తన రెండు చిత్రాలపై నమ్మకం వ్యక్తం చేస్తున్న యువహీరో

Published on Apr 29, 2015 1:07 AM IST

sudeerbabu
వెండితెరపై తనకంటూ ఒక ముద్ర వేసుకుని కెరీర్ కొనసాగిస్తున్న నటుడు సుధీర్ బాబు. ఎస్.ఎం.ఎస్ సినిమాతో తెరారంగ్రేటం చేసి ప్రేమకధా చిత్రమ్ తో బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. అయితే సుధీర్ నటించిన ఆఖరి చిత్రం ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది.

అయితే ప్రస్తుతం సుధీర్ చేతిలో రెండు మంచి సినిమాలు వుండడం ఆసక్తికరం. చంద్రు దర్శకత్వంలో నందిత రాజ్ హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమా అందులో ఒకటి. అచ్చమైన తెలుగు టైటిల్ తో ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి కలిగించాడు.

మొదటిది క్లాస్ టైటిల్ తో వస్తే రెండవ సినిమాగా ‘మోసగాళ్ళకు మోసగాడు’ అనే క్రైమ్ కామెడీ మాస్ మూవీతో అలరించనున్నాడు/ఏ.ఎన్ బోస్ దర్శకుడు. నిఖిల్ నటించిన ‘స్వామి రారా’ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం ప్రాచుర్యం పొందుతుంది.

ఈ రెండు సినిమాల పైనా సుధీర్ బాబు భారీ ఆశలే పెట్టుకున్నాడు. అయితే చిత్ర విజయాలపై ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఏదిఏమైనా సుధీర్ బాబు కెరీర్ ఈ వసవిలో మంచి మలుపు తిరగడం ఖాయం.

తాజా వార్తలు