మెడికల్ బ్యాక్ గ్రౌండ్ లో యంగ్ హీరో ?

Published on Oct 26, 2020 12:26 pm IST

యంగ్ హీరో ‘రాజ్‌ తరుణ్‌’ ఈ మధ్య వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద సతమతమవుతున్నాడు. అయితే, రాజ్ తరుణ్ కి ఒక బంపర్ ఆఫర్ తగిలిందని, రైటర్ కోన వెంకట్ నిర్మించబోతున్న సినిమాలో రాజ్ తరుణ్ ను హీరోగా అనుకుంటున్నారని.. ఈ సినిమాలో మెడికల్ బ్యాక్ గ్రౌండ్ లోని లొసుగులను ఫన్నీ ‘వే’లో ప్రస్తావించబోతున్నారని తెలుస్తోంది. మొదట ఈ కథ సాయి ధరమ్ తేజ్ దగ్గరకు వెళ్ళింది. అయితే ప్రసుతం సెట్ మీద ఒక సినిమా ఉంది, అలాగే త్వరలో మరొకటి సెట్ మీదకు వెళ్లనుంది.

ఇవి కాకుండా ఆల్ రెడీ మరో కథను ఓకే చేశాడు. ఇన్ని సినిమాలను చేతిలో ఉండటంతోనే తేజ్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి తరువాత నుండి లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ‘ఒరేయ్ …బుజ్జిగా’ అనే సినిమాతో వచ్చిన రాజ్ తరుణ్ పర్వాలేదనిపించాడు. ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చింది.

సంబంధిత సమాచారం :

More