షాకింగ్ లుక్ లో యంగ్ హీరో !

Published on May 16, 2021 8:25 pm IST

‘హ్యాపీడేస్‌’ సినిమాలో ఇండస్ట్రీకి చాలామంది కొత్త వాళ్ళు పరిచయమయ్యారు. అందులో తమన్నా, నిఖిల్ లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఫామ్ లోనే కొనసాగుతున్నారు. ఇక వరుణ్ సందేశ్ ఈ మధ్యే తన సెకెండ్ ఇన్నింగ్స్ ను కూడా స్టార్ట్ చేశాడు. అయితే హ్యాపీడేస్‌ సినిమాలో ఈ ముగ్గురు కాకుండా జనాలకు బాగా కనెక్ట్‌ అయిన మరో హీరో రాహుల్. సినిమాలోనే కీలకమైన ‘టైసన్‌’ పాత్రలో రాహుల్ చాల బాగా నటించి మెప్పించాడు.

పైగా టైసన్‌ పాత్రలో తన నటనతో అవార్డు కూడా తీసుకున్నాడు. ఐతే రాహుల్‌ ఆ సినిమా చేస్తోన్న సమయంలో మరీ బక్కగా ఉండేవాడు. అందుకే, అందరూ అతడిని బయట కూడా వెటకారంగా టైసన్‌ అని ఆటపట్టిస్తుండే వారట. రెండేళ్ల క్రితం ఒక సినిమా కూడా చేశాడు. ఆ సినిమాలో కూడా రాహుల్ సాధారణ లుక్ లోనే కనిపించాడు. కానీ రాహుల్ కొత్త లుక్ మాత్రం అందర్నీ షాక్ కి గురి చేసింది. రాహుల్‌ గుర్తుపట్టలేనంతగా కండలు తిరిగిన దేహంతో, మీసకట్టుతో కొత్తగా కనిపిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :