బాలయ్యకి తమ్ముడిగా యంగ్ హీరో ?

బాలయ్యకి తమ్ముడిగా యంగ్ హీరో ?

Published on Dec 7, 2020 6:59 AM IST

Naveen Chandra

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమాలో యంగ్ హీరో నవీన్ చంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని ఇప్పటికే అనేక రూమర్లు వచ్చాయి. అయితే, నవీన్ చంద్రది బాలయ్య తమ్ముడి క్యారెక్టర్ అని తెలుస్తోంది. తమ్ముడ్ని చంపేసాక బాలయ్య ఎలా రియాక్ట్ అయ్యాడు, వారి పై పగ ఎలా తీర్చుకున్నాడు అనేది మెయిన్ పాయింట్ అట. నవీన్ చంద్ర, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు, ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఈమేజ్ తెచ్చుకున్న న‌వీన్ చంద్ర హీరోగా తెర‌కెక్కిన సినిమా భానుమ‌తి రామ‌కృష్ణ‌ ఆహాలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఇక బాలయ్య రైతు క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. ‘బాలయ్య – బి గోపాల్’ సూపర్ హిట్ కాంబినేషన్ లో ఈ సినిమా ఉంటుందని.. బాలయ్య శైలిలోనే చిత్రం సాగుతూ కాస్త కొత్తగా కూడా ఉంటుందని తెలుస్తోంది.

తాజా వార్తలు