ద్విభాషా చిత్రంలో యంగ్ హీరో !

Published on Apr 28, 2019 3:00 pm IST

ట్యాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం 96 రీమేక్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ కెన్యా లో జరుగుతుంది. ఇక ఈచిత్రానికి ముందు శర్వా ,స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్షన్ లో గ్యాంగ్ స్టర్ డ్రామా లో నటించాడు. ప్రస్తుతం ఈచిత్రం పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది.

ఇక ఇప్పుడు శర్వా తాజాగా ఓ బైలింగ్వల్ (తెలుగు -తమిళ్ )మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ప్రముఖ తమిళ నిర్మాత ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని టాక్. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. ఇక ఈ చిత్రం తోపాటు శర్వా మరో తెలుగు మూవీ కి ఓకే చెప్పడట. 14రీల్స్ బ్యానర్ ఈచిత్రాన్ని నిర్మించనుంది.

సంబంధిత సమాచారం :