మరో పాటను విడుదల చెయ్యనున్న యువహీరో !
Published on Mar 5, 2018 1:59 pm IST

కన్నడలో విజయం సాధించిన కిరిక్ పార్టి సినిమాను తెలుగులో కిరాక్ పార్టి పేరుతో రూపొందుతున్న సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమా ద్వారా శరణ గోపిశెట్టి దర్శకుడిగా పరిచయం కానున్నారు. అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఏకే.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇటీవల ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈరోజు సాయంత్రం 7 గంటలకు మరో పాటను రిలీజ్ చెయ్యనున్నారు. మర్చి 16 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు కొత్త వాళ్ళు ఈ సినిమాలో నటించడం జరిగింది. టీజింగ్ టిజర్ పేరుతో విడుదలైన కిరాక్ పార్టి ప్రోమో ఆకట్టుకుంది.

 
Like us on Facebook