ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైనర్ తో యంగ్ హీరో !

ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైనర్ తో యంగ్ హీరో !

Published on Mar 17, 2019 11:12 PM IST

Sundeep Kishan

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ లాంటి ఫుల్ ఎంటర్ టైనర్ తో మంచి హిట్ అందుకున్న సందీప్ కిషన్, మళ్లీ ఆ తరువాత ఆ స్థాయిలో కామెడీ సినిమాను చెయ్యలేదు. అందుకే ఈ సారి ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని చేసి.. సూపర్ హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డితో ‘తెనాలి రామకృష్ణ బిఎబిఎల్’ అనే సినిమాని చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సిక కథానాయకిగా నటిస్తోంది. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరి ఈ చిత్రంతోనైనా సందీప్ కిషన్ హిట్ కొడతాడేమో చూడాలి.

కాగా ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కతున్న ఈ చిత్రంలో సిచ్యుయేషన్ కామెడీ చాలా బాగా వస్తోందట.. ముఖ్యంగా సందీప్ కిషన్ చుట్టూ జరిగే డ్రామా.. ఆ డ్రామా కారణంగా హీరో పడే ఇబ్బందులు.. ఆ ఇబ్బందులకు హీరోయిన్ పెట్టే టార్చర్.. ఆ టార్చర్ నుండి తప్పించుకోవడానికి హీరో చేసే పనులు.. ఆ పనులకు మిగిలిన పాత్రలు ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాయి, లాంటి అంశాల చుట్టూ ఈ సినిమా సాగుతుందట. మొత్తానికి తెనాలి రామకృష్ణ ఫుల్ కామెడీతో రాబోతున్నాడు అన్నమాట.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు