
కామెడీ నటుడు ధనరాజ్, మనోజ్ నాదం, రణధీర్, అనీల్, శ్రీ ముఖి తదితరులు నటిస్తున్న ‘ధనలక్ష్మి తలుపుతడితే’ సినిమా షూటింగ్ ముగించుకుని ప్రస్తుతం నిర్మాణాంతర పనులలో బిజీగా వుంది. భీమవరం టాకీస్ బ్యానర్ లో ఈ సినిమాను తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రామ్ గోపాల్ వర్మ విడుదలచేసారు.
ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాట కోసం ఇండస్ట్రీలో యువ హీరో చిందేసారని చిత్ర నిర్మాత తెలిపారు. ఆ హీరో పేరు బయటకి చెప్పకపోయినా పాట రూపుదిద్దుకున్న తీరుపై చిత్ర బృందం సంతోషం వ్యక్తంచేసారు. సినిమాకు ఈ పాత ప్రధానాకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. అచ్యుత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

