
‘బృందావనం’ మూవీలో ‘యువకుల మనసైనా’, ఇష్క్ లో ‘ఓ ప్రియ ప్రియా’, ‘చిన్నదాన నీకోసం’ అనే పాటలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ మంచి పాటల రచయితగా పేరు తెచ్చుకున్న యంగ్ లిరిసిస్ట్ కృష్ణ చైతన్య. లిరిసిస్ట్ గా ఎన్నో హిట్ సాంగ్స్ ని అందిస్తూనే దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా ‘రౌడీ ఫెలో’. నారా రోహిత్ హీరోగా నటించిన ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా పెద్ద హిట్ కాకపోయినా రైటర్ గా, దర్శకుడిగా కృష్ణ చైతన్యకి మంచి పేరు వచ్చింది.
ప్రస్తుతం పలు సినిమాలకు పాటలు రాసుకుంటూ మరో కథని సిద్దం చేసాడు కృష్ణ చైతన్య. ఈ సినిమా కోసం కృష్ణ చైతన్య యంగ్ హీరో నితిన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. నితిన్ ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా కాకుండా వేణు మల్లిడి చెప్పిన కథని కూడా నితిన్ లైన్ లో పెట్టాడు. కృష్ణ చైతన్య చెప్పే ఫైనల్ స్క్రిప్ట్ ఓకే అయితే ఈ రెండు సినిమాల తర్వాత నితిన్ కృష్ణ చైతన్య సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉంది. ఇది కాకుండా నితిన్ నటించిన కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ కావడానికి సిద్దమైంది.

