తన 20వ చిత్రం ఫై స్పందించిన ప్రభాస్ !

Published on Sep 6, 2018 10:33 am IST

బాహుబలి చిత్రం తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో ప్రభాస్. ప్రస్తుతం అయన ‘రన్ రాజా రన్’ చిత్ర దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం తరువాత ప్రభాస్ తన 20వ చిత్రాన్ని ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈచిత్రం ఈరోజు గ్రాండ్ గా లాంచ్ కానుంది. అగ్ర దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిధిగా రానున్నాడు.

ఇక తన 20వ చిత్రం గురించి ప్రభాస్ స్పందిస్తూ చాలా హేగ్సైటెడ్ గా వున్నాను. నా తదుపరి చిత్రం రాధా కృష్ణ కుమార్ మూడు భాషల్లో తెరకెక్కించనున్నాడు. గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అని ఆయన తన పేస్ బుక్ ద్వారా వెల్లడించారు.

సంబంధిత సమాచారం :