పెళ్లి చేసుకోబోతున్న యంగ్ హీరో ?

Published on Jun 7, 2021 1:14 pm IST

హీరో రాజ్ తరుణ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ యంగ్ హీరో వివాహ బంధంలోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. ఇక రాజ్ తరుణ్ ఇటీవల హైదరాబాద్ లోని తన కొత్త ఇంట్లోకి మారినట్లు తెలుస్తోంది. వివాహం తర్వాత తన ఫ్యామిలీతో ఇక్కడే స్థిరపడాలని రాజ్ తరుణ్ ప్లాన్ చేస్తున్నాడు.

అయితే, రాజ్ తరుణ్ తన వివాహం గురించి మాత్రం ఇంతవరకు ఎక్కడా ఏమి చెప్పలేదు. కాకపోతే, ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం పెళ్లి గురించి ఇప్పట్లో తనకు ఎలాంటి ఆలోచనలు లేవని తెలుస్తోంది. కానీ, రాజ్ తరుణ్ సన్నిహితులు మాత్రం రాజ్ తరుణ్ వివాహం చేసుకోవటానికి సిద్ధం అవుతున్నాడని చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :