యంగ్ టైగర్ ఫ్యాన్స్ గట్టి టార్గెట్టే పెట్టుకున్నారు.!

యంగ్ టైగర్ ఫ్యాన్స్ గట్టి టార్గెట్టే పెట్టుకున్నారు.!

Published on Oct 15, 2020 6:01 PM IST

NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ పాన్ ఇండియన్ చిత్రం నుంచి బాకీ ఉన్న భీం టీజర్ కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తారక్ నుంచి ఒక టీజర్ వచ్చి రెండేళ్లు దాటిపోయింది.

దీనితో “రామరాజు ఫర్ భీం” టీజర్ కు గట్టి టార్గెట్ నే పెట్టుకున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ రికార్డ్స్ కూడా చాలా ప్రిస్టేజియస్ గా మారిపోయాయి. అలా టీజర్ కు కొన్ని మన టాలీవుడ్ లో ఫస్ట్ ఎవర్ రికార్డ్స్ ను సెట్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. 24 గంటల్లో మోస్ట్ వ్యూడ్ టీజర్ గా నిలపడమే కాకుండా మోస్ట్ లైక్డ్ టీజర్ గా నిలపాలి అన్నది వాళ్ళ ఆకాంక్ష మరి అదే కనుక సక్సెస్ అయితే టాలీవుడ్ లో సాలిడ్ రికార్డ్స్ నమోదు అయ్యినట్టే. మరి వారు అనుకుంటున్న టార్గెట్ ను రీచ్ అవుతారో లేదో చూడాలి. ఈ టీజర్ వచ్చే అక్టోబర్ 22న రిలీజ్ కానుంది.

తాజా వార్తలు