5 మిలియన్ స్టోన్ టచ్ చేసిన తారక్.!

Published on May 29, 2021 12:00 pm IST

మన టాలీవుడ్ మాస్ ఆడియెన్స్ లో అపారమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. అందుకు నిదర్శనంగా తన సినిమాల ఓపెనింగ్ వసూళ్లే సమాధానం చెబుతాయి. ఇక ఇదిలా సోషల్ మీడియాలో కూడా తారక్ కు స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉంది. మరి అలా లేటెస్ట్ గా తారక్ తన ట్విట్టర్ ఖాతాను 5 మిలియన్ మార్క్ కు చేరుకున్నాడు.

నిన్నటికి ఈరోజుకి పెరిగిన 2వేల మంది ఫాలోవర్స్ తో 50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అతి కొద్ది మంది టాలీవుడ్ స్టార్ నటుల్లో ఒకరిగా తారక్ నిలిచాడు. ఇక ఇదిలా ఉండగా తారక్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో “RRR” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం సహా కొరటాల శివతో ఓ సినిమా దాని తర్వాత సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :