యంగ్ టైగర్ ఈ సెన్సషనల్ కాంబో ఆల్ మోస్ట్ ఫిక్స్.!

Published on Apr 11, 2021 8:00 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జక్కన్న రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే గ్యాప్ లో దీని తర్వాత చెయ్యబోయే సినిమా కోసం కూడా రేపు ఉగాది సందర్భంగా అప్డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. అయితే ఇంతకు ముందే తారక్ మరో హిట్ దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నాడని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

మరి ఇప్పుడు ఈ సెన్సేషనల్ కాంబో ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అన్నట్టే తెలుస్తుంది. జస్ట్ అధికారిక క్లారిటీ రావడమే తరువాయి అని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన “జనతా గ్యారేజ్” ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. మరి ఈసారి ఎలాంటి సబ్జెక్ట్ తో రానున్నారో చూడాలి. ఇప్పుడు ఈ ఇద్దరూ పాన్ ఇండియన్ సినిమాల్లోకి ఎంటర్ కానున్నారు. మరి అది కూడా పాన్ ఇండియన్ లెవెల్లోనే ఉంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :