నీతి వాక్యాలు చెప్పిన బోల్డ్ హీరోయిన్ !

Published on Jun 6, 2021 2:05 am IST

బాలీవుడ్ బోల్డ్ నటి భూమి ఫెడ్నేకర్‌ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ప్రపంచ పర్వావరణ దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘మన అభిప్రాయాన్ని బాహాటంగా అందరికి అర్ధమయ్యేలా వ్యక్తపరచడం చాలా ముఖ్యం. అయితే ఒక్కోసారి ఎదురుతిరిగే ఈ గొంతుకకు కొన్ని ఎదురుదెబ్బలు తగులుతాయి. కానీ మెరుగైన సమాజం కోసం మన గొంతుకను రెండింతలుగా పెంచాల్సిన అవసరం ఉంది. అలా చేస్తే కొన్ని ఇబ్బందులు సైతం ఎదురుకావచ్చు.

కానీ మనం నమ్మిన ఆలోచనలు వ్యక్తపరచడానికి కొంత ఆత్మవిశ్వాసం కూడా అవసరం కాబట్టి, మనం దైర్యంగా మనం అనుకున్న దానికే కట్టుపడి ఉండాలి. ఇది మన బాధ్యత, ఈ జ్ఞానంతోనే సమాజాన్ని ప్రభావితం చేయగలిగే బాధ్యతగల వ్యక్తిగా మనం ఉండగలం. మనం గట్టిగా చెప్పినప్పుడే ఆ చెప్పే విషయానికి కూడా గొప్ప శక్తి వస్తుంది. అప్పుడు మనల్ని అనుసరించే వారికి గొప్ప నమ్మకాన్ని కలిగిస్తుంది’’ అంటూ మోటివేట్ చేసింది భూమి.

సంబంధిత సమాచారం :