బాబు గారూ వర్మ చేసిన తప్పేంటి..? – జగన్

Published on Apr 29, 2019 9:55 am IST

రామ్ గోపాల్ వర్మ నిన్న విజయవాడలోని ఓ హోటల్‌ లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించి ఓ ప్రెస్‌ మీట్ పెట్టాలని ప్రయత్నిస్తే.. ఆ హోటల్ యాజమాన్యం ప్రెస్ మీట్ కు అనుమతి నిరాకరించడం.. దాంతో తన ప్రెస్ మీట్ ను నడి రోడ్డు పైనే పెట్టబోతున్నట్లు వర్మ ప్రకటించడం.. దాంతో పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా వర్మను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

కాగా తాజాగా ఈ విషయం పై వైయస్ జగన ట్విట్టర్ ద్వారా స్పందించారు. జగన్ పోస్ట్ చేస్తూ.. ‘విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం.
చంద్రబాబు గారూ. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..? అని పోస్ట్ చేసారు.

ఏమైనా రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని తీసిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. కాగా ఈ చిత్రం ఏపీలో మే 1వ తేదీన విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :