‘జెండాపై కపిరాజు’ రిలీజ్ డేట్ మారొచ్చు – హీరో నాని

‘జెండాపై కపిరాజు’ రిలీజ్ డేట్ మారొచ్చు – హీరో నాని

Published on Mar 10, 2015 5:09 PM IST

Jendapai-kapiraju1
నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ ఉగాది కానుకగా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పలు సమస్యలతో ల్యాబ్ కు పరిమితమైన ‘జెండాపై కపిరాజు’ కూడా ఉగాది రోజున విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. నాని సినిమాల మధ్య పోటి తప్పదని అంతా భావించారు. దీనిపై నాని క్లారిటీ ఇచ్చాడు. ‘జెండాపై కపిరాజు’ రిలీజ్ డేట్ మారుతుందని హింట్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేది పలుసార్లు మారింది.

‘వరల్డ్ కప్ ప్రభావం మార్నింగ్ షోలపై ఉంటుందేమో కానీ, ఈవెనింగ్.. నైట్ షోలపై ఉండదు. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ గురించి ఆందోళన చెందడం లేదు. ప్రేక్షకులు సినిమా చూడడం కోసం థియేటర్లకు వస్తారనే నమ్మకం ఉందని’ తాజా ఇంటర్వ్యూలో నాని వ్యాఖ్యానించారు.

‘ఎవడే సుబ్రమణ్యం’తో పాటు సందీప్ కిషన్ ‘టైగర్’, సుధీర్ బాబు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’, ‘తుంగబధ్ర’ సినిమాలు ఉగాది పండుగ సందర్భంగా విడుదలవుతున్నాయి.

తాజా వార్తలు