భాయ్ దెబ్బకు క్రాష్ అయిపోయిన జీ5..!

Published on May 13, 2021 2:30 pm IST

బాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా స్టార్ హీరోయిన్ దిశా పటాని హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ చిత్రం “రాధే”. ఎప్పటి నుంచి సల్మాన్ అభిమానులు ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు డైరెక్ట్ స్ట్రీమింగ్ విడుదల అయ్యింది.

ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ “జీ 5″లో విడుదలతో పాటుగా పాజిబిలిటీ ఉన్న దగ్గర థియేట్రికల్ విడుదల కూడా మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే సల్మాన్ సినిమా వస్తుంది అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అలా ఈ చిత్రం నేరుగా స్ట్రీమింగ్ కు రావడంతో భాయ్ దెబ్బకు జీ 5 వారి స్ట్రీమింగ్ యాప్ క్రాష్ అయ్యిపోయిందట. మొత్తం 1 మిలియన్ మందికి పైగానే సినిమా చూసేందుకు వచ్చారట.

ఈ విషయాన్నే ఓటిటి నిపుణులు చెప్తున్నారు. పే పర్ వ్యూ గా తీసుకొచ్చినా కూడా సల్మాన్ సినిమాకు గట్టి రెస్పాన్స్ నే వచ్చిందని చెప్పాలి.తర్వాత దానిని జీ 5 వారు ఫిక్స్ చేశారట. ఇక ఈ చిత్రంలో మన దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్రెండ్ సెట్టింగ్ ట్యూన్ “సీటీ మార్”కు భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని మల్టీ టాలెంటెడ్ దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :