జీరో కి క్రిస్మస్ సెలవు కలిసొచ్చింది !

Published on Dec 26, 2018 10:19 am IST

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన రొమాంటిక్ డ్రామా ‘జీరో’ డిసెంబర్ 21న విడుదలై మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది మచ్ అవైటెడ్ మూవీ గా విడులైన ఈచిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో బాక్సాఫిస్ వద్ద ఈచిత్రం రికార్డు స్థాయిలో కలక్షన్లను రాబట్టలేకతుంది. అయితే షారుక్ , అనుష్క ల నటన కు విమర్శకులనుండి ప్రంశంసలు దక్కాయి.

ఇక ఈ చిత్రం సోమవారం 9కోట్లను కలెక్ట్ చేయగా నిన్న క్రిస్మస్ సంధర్భంగా సెలవు దినం కావడంతో 12.75 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇండియాలో ఈచిత్రం 5రోజులకుగాను 81.32 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది

సంబంధిత సమాచారం :