సెన్సార్ పూర్తి చేసుకున్న ఇష్క్


యువ నటుడు నితిన్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఇష్క్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజే పూర్తి చేసుకుంది.

లవ్ ఫెయిల్యూర్ కృష్ణా జిల్లా కలెక్షన్స్


యువతరం హీరో సిద్ధార్థ్ నిర్మాతగా చేసిన మొదటి చిత్రం ‘లవ్ ఫెయిల్యూర్’.

పూలరంగడు తూర్పు గోదావరి కలెక్షన్స్


సునీల్ నటించిన ‘పూలరంగడు’ చిత్రానికి తూర్పు గోదావరి జిల్లాకు గాను మొదటి మూడు రోజులకు 35 లక్షల 11 వేల 352 రూపాయల (35,11,352/-) షేర్ దక్కించుకుంది.

పూలరంగడు నైజాం కలెక్షన్స్


కామెడీ హీరో సునీల్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని ఏరియాల నుండి మంచి వసూళ్లు సాధిస్తోంది.

హైదరాబాదుకు రానున్న ‘దమ్ము’ యూనిట్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ ప్రస్తుతం పోల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

మార్చి 12 తో ముగియనున్న “రెబెల్”

ప్రభాస్ మరియు రాఘవ లారెన్స్ కలయికలో వస్తున్న చిత్రం “రెబెల్”.

రసవత్తరమైన యాక్షన్ డ్రామాగా ఆటోనగర్ సూర్య


యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న ‘ఆటోనగర్ సూర్య’ చిత్ర షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది.

నిర్మాత పర్వతనేని మల్లిఖార్జునరావు మృతి

సీనియర్ నిర్మాత పర్వతనేని మల్లిఖార్జున రావు (76)ఈ రోజు మెడ్విన్ హాస్పటిల్ లో మరణించారు.

ఫ్యామిలీ సాంగ్ షూటింగ్లో పాల్గొంటున్న మహేష్ బాబు


సినిమా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.

భారి బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న “రచ్చ”

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం “రచ్చ” ఈ వేసవికి విడుదల అవ్వటానికి సకలం సిద్దమయ్యింది.

హిందీ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న అజయ్ భుయాన్

తెలుగు పరిశ్రమ లో నిలదోక్కుకోవాలన్న అజయ్ భుయాన్ కల “దడ” చిత్రం తో కూలిపోయాయి.

నాకు పెళ్లి కుదరలేదు : శ్రద్ద దాస్

శ్రద్ద దాస్ మరోమారు పుకార్లతో వార్తల్లో నిలిచారు.

కన్నడం లో కి ప్రవేశించబోతున్న ఇషా చావ్లా

ఇషా చావ్లా కన్నడ పరిశ్రమ లో కి ప్రవేశించడానికి సకలం సిద్దమయ్యింది .

మహేష్ బాబు అందం వెనుక రహస్యం

మన దేశంలో ఉన్న హీరోలలో బాగా అందమైన హీరోలలో ప్రిన్సు మహేష్ బాబు కూడా ఒకరు.

అది కేవలం ముద్దు మాత్రమే: కాజల్

అందాల భామ కాజల్ అగర్వాల్ నటించిన ‘బిజినెస్ మేన్’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

చివరి దశకు చేసృకున్న రెబల్ షూటింగ్

యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘రెబల్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న బన్ని-త్రివిక్రమ్ చిత్రం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు డైరెక్షన్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

సీతమ్మ వాకిట్లో సోలో పాట పాడుకుంటున్న సమంతా

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంతా హీరొయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

వెంకటేష్ తో నటించడం గొప్ప అనుభూతి

ప్రిన్స్ మహేష్ బాబు ఇటీవల ఒక ప్రాంతీయ ఛానల్ తో మాట్లాడుతూ

ఈ వారంలో రాబోతున్న గబ్బర్ సింగ్ టీజర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గబ్బర్ సింగ్’ మొదటి టీజర్ వీడియో ఫిబ్రవరి 23 న విడుదల చేయనున్నారు.

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో రామ్

బొమ్మరిల్లు భాస్కర్ తన సినిమాలో హీరో కోసం వెతుకులాట పూర్తయింది.

ప్రత్యేకం: రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనున్న అమలా పాల్

అమలా పాల్ మెల్లి మెల్లిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాపులర్ హీరొయిన్ గా మారబోతుంది.

నా సిక్స్ ప్యాక్ వెనుక కఠోర శ్రమ ఉంది: సునీల్

సునీల్ యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు.

యముడి పాత్రలో అలరించనున్న శ్రీహరి

యమ ధర్మ రాజు పాత్రని హాస్య భరితంగా మలచడంలో టాలీవుడ్ పెట్టింది పేరు.

సమీక్ష : పూల రంగడు – ఒక అందమయిన కమర్షియల్ చిత్రం

విడుదల తేది : 18 ఫిబ్రవరి 2012
123తెలుగు.కాం రేటింగ్: 3.25/5
దర్శకుడు : వీరబ్రహ్మం
నిర్మాత :కె అచ్చిరెడ్డి
సంగిత డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
తారాగణం : సునీల్,ఇషా చావ్లా, కోటా శ్రీనివాసరావు , ప్రదీప్ రావత్

సునీల్ మరియు ఇషా చావ్లా లు జంటగా చేసిన చిత్రం “పూల రంగడు”. వీరభద్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కే.అచ్చి రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదల అయింది ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

రంగ(సునీల్), రియల్ ఎస్టేట్ బ్రోకేర్ గా ఉంటాడు కాని ఆర్ధిక సమస్యలతో బాధ పడుతూ ఉంటాడు. అప్పుడు ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ప్రిన్సు దగ్గర నుండి గవరాజు(పృథ్వీ) అనే పాత్ర దగ్గర అప్పు చేసి ఒక భూమి కొనుక్కుంటాడు తన సమస్యలు అన్ని తీరిపోతాయి అని అనుకుంటాడు. ఆ స్థలాన్ని అమ్మాలని ప్రయత్నిస్తుండగా ఆ స్థలం కోన రెడ్డి(దేవ్ గిల్) మరియు లాలా గౌడ్(ప్రదీప్ రావట్) మధ్యలో చిక్కుకొని ఉంటుంది అని తెలుసుకుంటాడు. ఈ సమస్యల నుండి బయటపడాలంటే లాలా గౌడ్ కూతురు అనిత(ఇషా చావ్లా) ఒక్కటే మార్గం అనుకున్న రంగ అనిత మరియు తన స్నేహితుడు వాసు(ఆలి) ల తో కలిసి కోన రెడ్డి మరియు లాలా గౌడ్ లను కలపాలని ప్రయత్నిస్తాడు వాళ్ళిద్దరి కుటుంబాలను ఎలా కలిపాడు అనేదే మిగిలిన కథ.

ప్లస్:

సునీల్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ తన డాన్స్ లతో మరియు తన హాస్య చతురత తో ప్రేక్షకులను అలరించారు. పతాక సన్నివేశాలలో వచ్చే పోరాటాలలో అద్బుతంగా చేశారు. చిరంజీవి మరియు మోహన్ బాబు లను అనుకరించే సన్నివేశం లో అద్బుతంగా చేశారు.

ఇషా చావ్లా తన అందంతో చాలా బాగా అలరించింది కొన్ని సన్నివేశాలలో చాలా బాగా చేసింది సునీల్ కి తన ప్రేమను తెలియ చేసే సన్నివేశం లో తను పలికించిన భావాలు అద్బుతం. సునీల్ సరసన సరిజోడి అనిపించుకుంది.

అలీ మరియు రఘుబాబు వారి వారి పాత్ర పరిధిలో బానే చేసారు. దేవ్ గిల్ మరియు ప్రదీప్ రావత్ ప్రతినయకులుగా పరవాలేదనిపించారు. పృథ్వీ రాజ్ ఈదర గవరాజు పాత్రలో ప్రేక్షకులను బాగా నవ్వించారు. తెలంగాణా శకుంతల చిన్న పాత్ర చేసిన ఉన్నంతసేపు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.

చిత్రం లో మొదటి అర్ధ భాగం చాల వేగంగా సాగుతుంది. తెర మీద పాటలు చూడటానికి చాలా బాగున్నాయి. పతాక సన్నివేశాలలో వచ్చే పోరాటాలు చాలా బాగా వచ్చాయి

మైనస్ :

శరీర సౌష్టవం ఎలా ఉన్నా కాని సునీల్ కి గతం లో ఉన్న కళ కనపడటం లేదు ఈ విషయం మీద సునీల్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. “పూల రంగడు” అనే పేరు కి ఎక్కడ న్యాయం చేసినట్టు కనిపించలేదు. కోట శ్రీనివాసరావు ,సుధా మరియు దువ్వాసి మోహన్ ల పాత్రలు పెద్దగా ఆకట్టుకోలేదు. రెండవ అర్ధం లో కథ కాస్త లోపించి నెమ్మదిస్తుంది. చిత్ర కథ లో కాస్త మర్యాద రామన్న ఛాయలు కనిపిస్తాయి. దేవ్ గిల్ పాత్రలో కాస్త నిలకడలేమి తనం కనిపిస్తుంది

సాంకేతిక విభాగం :

కథ,కథనం మరియు దర్శకత్వ బాధ్యతలు వీరభద్రమ్ నిర్వహించారు. అన్ని విభాగాల లోను చాలా బాగా చేశారు. మంచి కమర్షియల్ దర్శకునిగా భవిష్యత్తు ఉంది. మొదటి అర్ధం లో కథనం వేగంగా నడిచినా రెండా అర్ధ భాగం నెమ్మదించింది ఈ విషయం మీద కాస్త దృష్టి సారించాల్సి ఉంది. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ పరవాలేదు.

శ్రీధర్ సీపన రచించిన సంభాషణలు సన్నివేశానికి తగ్గట్టు చాలా బాగా ఉన్నాయి. అనూప్ సమకూర్చిన నేఫధ్య సంగీతం అందులోనూ పతాక సన్నివేశాలలో ఇచ్చిన నేఫధ్య సంగీతం అద్బుతం. కోరియోగ్రఫీ చాలా బాగుంది సునీల్ ని అద్బుతంగా ఉపయోగించుకున్నారు.

తీర్పు :

పూల రంగడు మంచి ఎంటర్ టైనింగ్ చిత్రం . సునీల్ నటన వీరభద్రమ్ వేగంతో కూడిన కథనం ఇషా చావ్లా అందం ఈ చిత్రానికి ఆకర్షణలుగా నిలిచాయి. చిత్రం లో కొత్తదనం ఏమి లేకపోయినా హాస్యం మరియు కథనం బాగా సమకూరాయి. ఇవే పూల రంగడు విజయ అవకాశాలను మెరుగు పరిచాయి.

123తెలుగు.కామ్ రేటింగ్: 3.25/5

అనువాదం :రవి తేజ

Clicke Here For ‘Poola Rangadu’ English Review

మేఘాలలో తేలిపోతున్న సిద్దార్థ్

“లవ్ ఫైల్యూర్” చిత్రానికి వస్తున్న సానుకూల విమర్శలకి సిద్దార్థ్ చాలా ఆనందంగా ఉన్నారు. సిద్దార్థ్ మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలలో వచ్చిన ఈ చిత్రం అందరి విమర్శకుల మెప్పు పొందింది ఈ విషయమై సిద్దార్థ్ పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూ ” బొమ్మరిల్లు చిత్రం నుండి ఇప్పటి వరకు నా నటన గురించి ఇలా అందరి మెప్పు పొందటం ఇదే మొదటి సారి ఈ చిత్ర బృందానికి,బెల్లం కొండ సురేష్ మరియు తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు ఇలాంటి మరిన్ని చిత్రాలు భవిష్యత్తు లో చేస్తాను ” అని చెప్పారు. రేపటి నుండి ఈ చిత్రాన్ని మరిన్ని థియేటర్ ల లో ప్రదర్శించబోతున్నారు. ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

కోయంబత్తూర్ లో హన్సికను చుట్టుముట్టిన అభిమానులు

తమిళ పరిశ్రమ లో హన్సిక రోజురోజుకి ఎదుగుతుంది. గత సంవత్సరం ధనుష్ సరసన “మాపిల్లై” చిత్రం తో అక్కడ పరిచయం అయిన ఈ భామ తరువాత విజయ్ సరసన చేసిన “వేలాయుధం” చిత్రం తో అక్కడ తన స్థానం పదిలం చేసుకుంది. ఈ మధ్య తను కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు వీలాది మంది అభిమానులు తనను చుదతానిక్ ఇవచ్చారు. అక్కడ పరిస్థితి పోలీసు ల చెయ్యి దాటింది అక్కడ జరిగిన తోపులాటలో హన్సిక కాస్త గాయపడ్డట్టు సమాచారం. హన్సికా కే న ఇంతటి అభిమానులు అనిపిస్తుంది కాదు. గతం లో నగ్మా మరియు కుష్బు ల లానే తనకి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం “ఒరు కల ఒరు కన్నాడి” చిత్రం లో మరియు “వేట్టై మన్నన్ ” చిత్రం లో గాంగ్ స్టర్ గా కనిపించబోతుంది.

తూర్పు గోదావరి జిల్లాలో 22 లక్షలు రాబట్టిన నిప్పు

రవి తేజ మరియు దీక్ష సెత్ లు ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం “నిప్పు”. ఈ చిత్రం మొదటి రోజు మంచి వసూల్లనే రాబట్టింది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం తూర్పు గోదావరి జిల్లా లో ఈ చిత్రం మొదటి రోజు 22 .65 లక్షలు వసూళ్లు చేసినట్టు సమాచారం. మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో ఈ చిత్రం 60 లక్షల దాక వసూళ్లు రాబట్టవచ్చని అంచనా. ఈ చిత్రం మొదటి రోజు వెయ్యికి పైగా థియేటర్ ల లో విడుదల అయ్యింది. రవితేజ నటన మరియు ఎనేర్జి ఈ వసూళ్ళకు కారణం. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైవిఎస్ చౌదరి నిర్మించారు.

“పూల రంగడు” చిత్రానికి సానుకూల స్పందన

సునీల్ మరియు ఇషా చావ్లా ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “పూల రంగడు” ఈరోజు రాష్ట్రమంతట విడుదల అయ్యింది. ఈ చిత్రం విడుదల అయ్యిన అన్ని కేంద్రాల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. చిత్రం లో సునీల్ ఆహార్యం మరియు డాన్స్ చిత్రానికి మంచి విమర్శలను రాబట్టాయి. దీనికి ఇషా చావ్లా అందం తోడు కావటం తో చిత్రం విజయం వైపు పరుగు తీస్తుంది. ఈ చిత్రం ఈరోజు రాష్ట్రం అంతట 450 కేంద్రాలలో విడుదల అయ్యింది గతం లో “మర్యాద రామన్న” మరియు “అందాల రాముడు” చిత్రాల విజయాలతో ఉన్న సునీల్ మరో విజయాన్ని తన ఖాతా లో చేర్చుకున్నారు. ఈ చిత్రానికి వీరభద్రమ్ దర్శకత్వం వహించారు. కే.అచ్చి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

కథానాయికకు తిరిగి వచ్చిన ప్రాధాన్యం

ప్రస్తుతం ఉన్న కథానాయికలు సమంత,ఇలియానా,అనుష్క,తమన్నా, శ్రుతి హాసన్ త్రిష అందరు చిత్రాల మీద ప్రభావం చూపుతున్నారు. పూర్తిగా పురుషాధిపత్యం ఉన్న ఈ పరిశ్రమ లో ఇది చెప్పుకోవాల్సిన విషయం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం లో తన పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుందని సమంత చెప్పుకొచ్చింది . ఈ చిత్రం లో ఇద్దరు ప్రధాన హీరోలు ఉన్నా తన పాత్ర ఆశ్చర్యం కలిగిస్తుందని కూడా చెప్పారు. “ఏ మాయ చేసావే” చిత్రం తో తనని పరిచయం చేసిన గౌతం మీనాన్ దర్శకత్వం లో రాబోతున్న చిత్రం “ఎటో వెళ్లిపోయింది మనసు ” చిత్రం గురించి కూడా సమంత చాలా ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు.

“బద్రీనాథ్” , “100% లవ్ ” “ఊసరవెల్లి” చిత్రాలలో తమన్నా తనకు ప్రాదాన్యమున్న పాత్రలు చేసింది. శ్రుతి హాసన్ “గబ్బర్ సింగ్” లో తన పాత్ర అభిమానులను ఆశ్చర్య పరుస్తుందని అన్నారు. నిత్య మీనాన్ కూడా “ఇష్క్” విషయం లో ఇదే అన్నారు. అరుంధతి విషయం లో అనుష్క కూడా అదే అన్నారు ప్రస్తుతం “డమరుకం” చిత్రం లో నటనకు ఆస్కారం ఉన్న పాత్ర చేస్తున్నట్టు సమాచారం.

రెట్టింపు అయిన అమల పాల్ ఆనందం


అమలా పాల్ కి అదృష్టం బాగా కలిసోచ్చినాటు కనిపిస్తుంది. ఈ మధ్య తనను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.

రితేష్ దేశ్ ముఖ్ సరసన నటించబోతున్న ప్రియమణి?


తాజా సమాచారం కనుక నిజమయితే ప్రియమణి రితేష్ పక్కన కథానాయికగా నటించడానికి అన్ని సిద్దమయినట్టే.

పద్దిహేను లక్షల నుండి మూడు కోట్ల వరకు సునీల్ ప్రయాణం


హాస్యనటుడిగా వచ్చి హీరో గా మారిన సునీల్ జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు 108 కిలోల బరువు ఉన్న సునీల్ ఇప్పుడు చాలా సన్నగా కండలు తిరిగి కనిపిస్తున్నారు.

సమీక్ష : నిప్పు – రవితేజ మార్కు రొటీన్ సినిమా

విడుదల తేది : 17 ఫిబ్రవరి 2012
123తెలుగు.కాం రేటింగ్: 3/5
దర్శకుడు : గుణశేఖర్
నిర్మాత :వైవిఎస్ చౌదరి
సంగిత డైరెక్టర్ : తమన్
తారాగణం : రవి తేజ , దీక్షా సేథ్ , రాజేంద్ర ప్రసాద్ , ప్రదీప్ రావాంత్

మాస్ మహారాజ రవితేజ తన స్నేహితులు గుణశేఖర్ మరియు వైవిఎస్ చౌదరి తో కలిసి ‘నిప్పు’ చిత్రంతో మన ముందుకు వచ్చారు. దీక్ష సేథ్ హీరొయిన్ గా నటించగా తమన్ సంగీతం అందించారు. గుణ శేఖర్ దర్శకత్వం వహించగా వైవిఎస్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

సూర్య (రవితేజ) జిమ్ కోచ్ గా పని చేస్తుంటాడు. శ్రీ (శ్రీరామ్) మరియు సూర్య ఇద్దరు ప్రాణ మిత్రులు. శ్రీ మరియు మేఘన (దీక్షా సేథ్) ల తండ్రి మూర్తి (రాజేంద్ర ప్రసాద్). రాజా గౌడ్ (ప్రదీప్ రావత్) అరాచకాల మీద సూర్య తిరగబడుతుంటాడు. శ్రీ సౌది అరేబియా కి వెళ్లి అక్కడ పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. సూర్య తన స్నేహుతుడైన శ్రీ ని కాపాడాలని నిర్ణయించుకుంటాడు. శ్రీ ఇరుక్కున్న సమస్యకి రాజా గౌడ్ కి సంబంధం ఉంటుంది. శ్రీ ఈ సమస్య నుండి బయట పడేందుకు సూర్య , రాజా గౌడ్ మీ ఎలా ఒప్పించాడు అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

రవితేజ తనదైన శైలిలో ఎనర్జిటిక్ పాత్రలో నటించాడు. సూర్య పాత్రలో ఇమిడిపోయి తన ఎనర్జీ లెవల్స్ ఎక్కడా తగ్గకుండా నటించాడు. తన ట్రేడ్ మార్క్ డైలాగ్ డెలివరీ మ్యానరిజం తో ప్రేక్షకులను మరియు ఆయన ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటాడు.దీక్షా సేథ్ చాలా బావుంది. ఆమె నటన కూడా బావుంది. రవితేజ, దీక్షా సేథ్ ల మధ్య కెమిస్ట్రీ బావుంది. వారిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా బాగా పండాయి. కాశి పాత్రలో బ్రహ్మానందం బాగా నవ్వించాడు. ప్రదీప్ రావత్ మరియు శ్రీరామ్ వారి పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. బ్రహ్మాజీ ఉన్న సన్నివేశాలు బాగా నవ్వించాడు. అతన్ని సరిగ్గా వాడుకుంటే కామెడీ బాగా పండిస్తాను అని నిరూపించాడు. ధర్మవరపు చిన్న పాత్రలో బాగానే నవ్వించాడు. హరీష్ శంకర్ ఒక పాటలో అలా కనిపించి వెళ్ళాడు. ముకుల్ దేవ్ పర్వాలేదు. సినిమా వేగంగా సాగుతూ బోరింగ్ సన్నివేశాలు లేకుండా సాగింది. రవితేజ పంచ్ డైలాగులు కూడా బాగా అలరిస్తాయి. బ్రహ్మానందం మరియు రాజేంద్రప్రసాద్ మధ్య బొమ్మరిల్లు స్పూఫ్ బాగా పండింది. కొన్ని పాటలు కూడా బాగా చిత్రీకరించారు.

మైనస్ పాయింట్స్:

సీనియర్ నటుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారికి తగ్గ పాత్ర నివ్వలేకపోయారు. అంతగా ప్రాధాన్యత లేని పాత్ర ఆయన పోషించారు. అలాగే కృష్ణుడు లాంటి మంచి నటుడిని కూడా సరైన పాత్రకు వాడుకోలేకపోయారు. ఎన్నో సినిమాల్లో నటించిన మాస్టర్ భరత్ బాగా లావు తగ్గాడు. అంత బరువు తగ్గి కామెడీ కూడా టైమింగ్ కూడా సరిగా చూపించలేకపోయాడు. గీత సింగ్ అయితే చిరాకు తెప్పిస్తుంది. చిత్ర కథనం ఇంకా బాగా చేయాల్సింది. శ్రీరామ్ సమస్యకి ప్రదీప్ రావత్ తో ఉన్న సంభందాన్ని సరిగా చూపించలేకపోయారు. గ్రాఫిక్స్ అస్సలు బాగా చూపించలేదు. రవితేజ తన బైక్ తో ట్రక్ మీద దూకించే సన్నివేశాలు ప్రేక్షకులకు రుచించవు.

సాంకేతిక విభాగం:

గుణశేఖర్ పనితనం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే బావుంది. యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం ఆయన ఇంకా మెరుగుపరుచుకుంటే బావుంటుంది. ఆయన నేరేషన్ మరియు స్క్రీన్ప్లే శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. ఈ చిత్రం గుణశేఖర్ మార్కు తో ఉండకపోవడం విశేషం. శ్రీధర్ సీపాన రాసిన డైలాగులు చాలా బావున్నాయి. గౌతం రాజు గారి ఎడిటింగ్ బాగాలేదు. ఆయన ఎడిటింగ్ బావుండి ఉంటే సినిమా ఇంకా మంచి రేంజ్ కి వెళ్లి ఉండేది. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.డాన్సులు రవితేజ స్టైల్లో పర్వాలేదనిపించాయి. ఫైట్లు కూడా బాగానే తీసారు.

తీర్పు:

నిప్పు సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ నేరేషన్ మరియు స్క్రీన్ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేది. రవితేజ మార్కు సినిమాలు నచ్చే వారికి నచ్చుతుంది. ఏలాంటి అంచనాలు లేకుండా చూస్తే మీకు కూడా నచ్చవచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్: 3/5

అనువాదం :అశోక్ రెడ్డి. ఎమ్

Clicke Here For ‘Nippu’ English Review

సమీక్ష : లవ్ ఫెయిల్యూర్ – ఒక వర్గం వారిని మాత్రమే ఆకట్టుకునే సినిమా

విడుదల తేది : 17 ఫిబ్రవరి 2012
123తెలుగు.కాం రేటింగ్: 2.75/5
దర్శకుడు : బాలాజి మోహన్
నిర్మాత :ఎస్.శశికాంత్, సిద్ధార్థ్, నీరవ్ షః
సంగిత డైరెక్టర్ : తమన్
తారాగణం : సిద్దార్థ్ ,అమలా పాల్

సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో నటిస్తూ నిర్మాతగా ఇటాకి బ్యానర్ పై నిర్మించిన మొదటి చిత్రం లవ్ ఫెయిల్యూర్. సిద్ధార్థ్ కి జోడీగా అమలా పాల్ నటించగా తమన్ సంగీతం అందించారు. అలాగే దర్శకుడు బాలాజీ మోహన్ కి కూడా ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

మొదటి సన్నివేశంలోనే పూర్ణిమ (అమలా పాల్) మరియు అరుణ్ (సిద్ధార్థ్) విడిపోతారు. ఎందుకు విడిపోయారు అన్నది తరువాతి సన్నివేశం నుండి చూపించే ప్రయతనం చేస్తాడు. అసలు అరుణ్, పూర్ణిమ ఎందుకు విడిపోయారు? వాళ్ళ తల్లితండ్రుల పాత్ర నేతవరకు ఉంది. వీరి తో పాటు వీరి స్నేహితుల ప్రేమకథలను కూడా చూపిస్తూ మొదటి భాగం వరకు సాగింది. రెండవ భాగం మొత్తం సమస్యను పరిష్కరించే విధంగా సాగుతుంది. ఎవరి జోక్యం లేకుండా ప్రేమ జంట ఒక్కటి కావడంతో ఈ ప్రేమకథ ముగుస్తుంది.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో డైలాగ్స్ మరియు చిత్ర కథనం ప్రేక్షకుడిని కూర్చోబెట్టేలా చేస్తాయి. చిత్రంలోని అన్ని పాత్రలు మనం రోజు మాట్లాడుకునే వాడుక భాషలోనే మాట్లాడుకుంటాయి. దర్శకుడు దాని నుండి కామెడీ రాబట్టాడు. చిత్రం వేగంగా సాగుతూ ఎక్కడ బోర్ కొట్టించకుండా సాగుతుంది. సిద్ధార్థ్ మొదటి బాగంలో బాగా నటించాడు. అతనికి ఇలాంటి పాత్రలు ఎన్నో నటించాడు కాబట్టి కొట్టిన పిండి లాగా చేసాడు. అమలా పాల్ కూడా బాగా నటించింది. ఇతర పాత్రల్లో నటించిన వారు కూడా వారి పరిధి మేరకు బాగా నటించారు. తమన్ సంగీతంలో మూడు పాటలు బావున్నాయి.

మైనస్ పాయింట్స్:

చిత్ర రెండవ భాగంలో మెయిన్ కథని వదిలేసి పక్క దారులు పడుతుంది. అలాగే ఇలాంటి సినిమాలు కాలేజ్ స్టూడెంట్స్ ని మాత్రమే ఆకర్షిస్తాయి. మాస్ ప్రేక్షకులను ఆకర్షించే అంశాలు అస్సలు లేకపోవడం విచారకరం. చిత్ర రెండవభాగంలో కొన్ని సన్నివేశాలకి కత్తెర వేసి ఉంటే బావుండేది. సినిమాలో కమర్షియల్ అంశాలు లేకపోవడం కూడా మైనస్ అని చెప్పుకోవాలి.

తీర్పు:

లవ్ ఫెయిల్యూర్ కాలేజ్ స్టూడెంట్స్ మరియు మల్టిప్లెక్స్ ఆడియెన్స్ కి మాత్రమే నచ్చే సినిమా. అలాగే సిద్ధార్థ్ సినిమాలు నచ్చే వారికి కూడా నచ్చుతుంది. మీరు విభిన్నమైన ప్రేమకథలు కోరుకుంటే తప్పక చూడండి.

కొస మెరుపు:

దర్శకుడు బాలాజీ మోహన్ చివర్లో క్లైమాక్స్ లో తలుక్కున మెరిసాడు.

123తెలుగు.కామ్ రేటింగ్: 2.75/5

అనువాదం :అశోక్ రెడ్డి. ఎమ్

Clicke Here For ‘Love Failure’ English Review

కార్తీక ఎనేర్జిటిక్ అమ్మాయి : త్రిష

ఎన్టీయార్,త్రిష మరియు కార్తీక ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “దమ్ము”.

మార్చ్ 2న విడుదల కానున్న “ఏకవీర”

రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి కథానాయకుడిగా వస్తున్న చిత్రం “ఏకవీర”

పైరసీ మీద విజయాన్ని సాదించిన రచ్చ

ఇంటర్నెట్ పైరసీ మరోసారి తన ప్రతాపం చూపించింది “రచ్చ” ఆడియో హక్కులను