బ్యాంకాక్ నుండి తిరిగి వస్తున్న ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ నెల 12న ఇండియాకి రాబోతున్నాడు. ప్రభాస్ నటిస్తున్న ‘రెబల్’ చిత్ర షెడ్యుల్ బ్యాంకాక్ లో జరుగుతుంది. ఈ షెడ్యుల్ ఈ నెల 12న ముగుస్తుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరియు కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం బ్యాంకాక్ వెళ్ళిన చిత్ర యూనిట్ ముఖ్య తారాగణం అంత ఈ షెడ్యుల్లో పాల్గొన్నారు. ఈ చిత్రానికి లారెన్స్ డైరెక్ట్ చేస్తున్నారు. తమన్నా మరియు దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. జె.భగవాన్ మరియు జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఉగాది విడుదలకు సిద్ధమవుతుంది.

యేసుదాసు గారికి జన్మదిన శుభాకాంక్షలు

సంగీత ప్రపంచంలో గొప్ప గాయకుడు అయిన ఏసుదాసు గారికి ఈరోజు పుట్టిన రోజు.

హ్రితిక్ రోషన్ కు జన్మదిన శుభాకాంక్షలు

బాలివుడ్ హీరో హ్రితిక్ రోషన్ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

చరణ్ తో జత కట్టనున్న హన్సిక


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే ముద్దుగుమ్మ హన్సిక తో జత కట్టనున్నాడు. వి.వి.వినాయక దర్శకత్వం లో చరణ్ చేయబోతున్న మాస్ ఏక్షన్ చిత్రం లో చరణ్ డబల్ రోల్ చేస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ చిత్రానికి కాజల్ అగ్గార్వాల్ ను ప్రధాన హీరొయిన్ గా ఎంపిక చేసుకోవటం జరిగింది. తాజాగా రెండవ హీరోయిన్ గా హన్సిక ను ఖరారు చేసుకున్నట్లు గా విశ్వసనీయ వర్గాల సమాచారం.

యునివెర్సల్ మీడియా బ్యానర్ పై డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలను అందిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల మొదటి వరం నుండి షూటింగ్ జరుపుకుంటుంది. నిర్మాతలు ఏక ధాటిగా షూటింగ్ ను జరిపి, సింగిల్ షెడ్యుల్ లో చిత్రాన్ని పూర్తి చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు.

బిజినెస్ మాన్ మరియు పోకిరి ల కథలు విబిన్నం – పూరి

బిజినెస్ మాన్ పోకిరి లను పోల్చటం తో వచ్చే అంచనాలు పూరి కి కాస్త బయపెట్టే విషయమే.

‘సేవకుడు’లో సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేక పాత్ర


శ్రీకాంత్ హీరోగా నటించిన ‘సేవకుడు’ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేక పాత్రలో నటించారు. కృష్ణ గారు ధనవంతుడైన ఎన్నారై పాత్రలో నటించారు. విదేశాలలో సంపాదించిన డబ్బును ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఇండియా ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచాలనే వ్యక్తిగా నటించారు. కృష్ణ గారితో కలిసి శ్రీకాంత్ గతంలో ‘వారసుడు’ మరియు ‘రౌడీ అన్నయ్య’ చిత్రాలలో నటించారు. శ్రీకాంత్ ఈ చిత్రంలో కూడా బాగా నటించారని చిత్రం విజయవంతం సాధిస్తుందని కృష్ణ గారు అన్నారు.

శ్రీకాంత్ మరియు ఛార్మి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సముద్ర దర్శకుడు. ఈ చిత్రంలో రాజకీయ అవినీతి పై సంఘంలో జరుగుతున్న పరిస్థితులపై పోరాడే యువకుడిగా శ్రీకాంత్ కనిపించబోతున్నారు. ముత్తినేని సత్యనారాయణ నిర్మాత కాగా శ్రీకాంత్ దేవా సంగీతం అందించిన ఆడియో ఇటీవలే విడుదలైంది.

తమిళం లో భారిగా విడుదల కానున్న “బిజినెస్ మాన్”

మాహేశ్ బాబు రాబోతున్న చిత్రం “బిజినెస్ మాన్ ” తమిళ నాడు లో భారి విడుదలకు సిద్దమయ్యింది

త్వరలో విడుదల కానున్న వెన్నెల 1 ½

వెన్నెల 1 ½ చిత్ర ఆడియో ఈ నెల ఆఖర్లో విడుదల కానుంది.

రిమేక్ కోసం నాగ చైతన్య ను సంప్రదించలేదు : యుటివి

నాగ చైతన్య ను ఎటువంటి రిమేక్ కోసం సంప్రదించలేదు అని “యుటివి” సంస్థ చెప్పింది.

“యాంగ్రీ బర్డ్స్” ఆటను వ్యాపకం గా మార్చుకున్న రామ్ చరణ్

రామ్ చరణ్ కి కొత్త వ్యాపకం దొరికింది – “యాంగ్రీ బిర్ద్స్” ఆటను ఖాళి దొరికినపుడల్లా తన ఐపాడ్ లో ఆడుతూ గడుపుతున్నారు.

“యు ” సర్టిఫికేట్ సంపాదించిన “బాడీ గార్డ్ “

విక్టరీ వెంకటేష్ నటించిన “బాడీ గార్డ్” చిత్రానికి సెన్సార్ వారు “యు” సర్టిఫికేట్ ఇచ్చారు.

బాడీగార్డ్ స్పెషల్ షోస్ వేసిన నిర్మాత


విక్టరీ వెంకటేష్ తన తరువాత చిత్రం ‘బాడీగార్డ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు. ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబందించిన స్పెషల్ షో నిన్న ప్రసాద్ లాబ్స్ లో వేయడం జరిగింది.

వెంకటేష్, సురేష్ బాబు, బెల్లంకొండ సురేష్ బాబు, మరియు తమన్ పలువురు ప్రముఖులు ఈ షోకి హాజరయ్యారు. వెంకటేష్ సరసన త్రిషా మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. తమన్ సంగీతం అందించగా బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఈ సంక్రాంతికి బాడీగార్డ్ తో పాటు బిజినెస్ మేన్ చిత్రం కూడా విడుదలవుతుంది.

“వేట్టై” చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్న బెల్లంకొండ

“వేట్టై” చిత్ర తెలుగు విడుదల హక్కులను బెల్లంకొండ సురేష్ 2011 లో “కాంచన” మరియు “కందిరీగ” వంటి విజయాలతో ఉన్న బెల్లంకొండ సురేష్

బాక్స్ ఆఫీస్ బాబూరావు బిజినెస్ మేన్ విశేషణ


హలో ఫ్రెండ్స్, బిజినెస్ మేన్ చిత్రం గురించిన మొత్తం సమాచారం అందించడానికి త్వరలో బాక్స్ ఆఫీస్ బాబూ రావు మీ ముందుకు రాబోతున్నాడు. అతను మీతో లైవ్ చాట్ చేస్తూ అందుబాటులో ఉంటాడు. మీకు ఏమైనా సందేహాలుంటే అతనిని అడగవచ్చు. బిజినెస్ మేన్ చిత్రానికి సంబందించిన తాజా సమాచారాన్ని సంక్షిప్తంగా మీకు అందిస్తాడు. ఏ థియేటర్ జనాలతో నిండిపోయింది, అక్కడ వారి రెస్పాన్స్ ఎలా ఉంది మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తుంటాడు. ఇంకా చాలా విషయాలు మీతో లైవ్ చాట్ చేస్తూ వార్తలు, ఫోటోలు, వీడియోలు అందిస్తాడు.
అతను మీకు నచ్చిన హీరో, నచ్చిన సినిమా గురించి సమగ్ర సమాచారం ఇస్తాడు. జనవరి 13వ తారీఖున ఉదయం 8:45 గం.ల నుండి
బాక్స్ ఆఫీస్ బాబూ రావు లైవ్ లో మీకోసం ఉంటాడు. సిద్ధంగా ఉండండి.

నోట్: ఈ పాత్ర కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించినది కాదు.

శర్వానంద్ ఇండస్ట్రీకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు


శర్వానంద్ మైనేని మంచి ప్రతిభ ఉన్న నటులలో ఒకరు. అతను తెలుగు చలచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 9 వసంతాలు పూర్తయింది. అతను నటించిన ‘జర్నీ’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. అతను నటించిన మొదటి చిత్రం ‘ఐదవ తారీకు’ 2003 లో విడుదలైంది.

ఆ తరువాత చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా ఏమ్బీబీఎస్’ చిత్రంలో నటించారు. ఆ తరువాత వెంకటేష్ తో కలిసి ‘సంక్రాంతి’ లక్ష్మి’ చిత్రాలలో కూడా నటించారు. దేవకట్టా డైరెక్షన్లో వచ్చిన ‘వెన్నెల’ చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్నారు శర్వానంద్. ప్రస్తుతం అల్లరి నరేష్ తో ఒక చిత్రం చేస్తున్న శర్వానంద్ మరికొన్ని చిత్రాలు కూడా చేయబోతున్నారు.

‘బిజినెస్ మేన్’లో కాజల్ అందాల ఆరబోత


కాజల్ అగర్వాల్ మహేష్ బాబు సరసన నటించిన ‘బిజినెస్ మేన్’ విడుదలకు సిద్ధమైంది. ఈ అందాల భామ ఈ చిత్రంలో భారీగా అందాల ఆరబోత చేసినట్లు సమాచారం. ఆమె తన అందంతో ప్రేక్షకులను కనువిందు చేయబోతున్నట్లు సమాచారం.

ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ చూస్తే ఈ విషయం బలపడుతుంది. కాజల్ అగర్వాల్ మొట్టమొదటిసారిగా మహేష్ బాబు సరసన ఈ చిత్రంలో నటిస్తుంది. జనవరి 13 న భారీగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఆర్ఆర్ మేకర్స్ వారు నిర్మించారు. సారోస్తారా పాట ఇప్పటికే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది.

ఉగాది పై కన్నేసిన ప్రభాస్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సారి తెలుగు సంవత్సరాది ఉగాది పండుగపై కన్నేశారు. లారెన్స్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘రెబల్’ చిత్రం ఉగాదికి విడుదల కాబోతుంది. ప్రభాస్ కి జోడీగా తమన్నా మరియు దీక్షా సేథ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతుంది. రెబల్ చిత్రాన్ని జే.భగవాన్ మరియు జే.పుల్లారావు నిర్మిస్తున్నారు. లారెన్స్ ఈ చిత్ర ప్రతీ ఫ్రేం స్టైలిష్ గా ఉండేలా తెరకెక్కిస్తున్నారు.

డబ్బు వెంట పరిగేత్తలేను: జెనీలియా


మంచి ప్రతిభ ఉన్న హీరోయిన్ జెనీలియా. తను తెలుగులోనే కాకుండా సౌత్ లో చేసిన చాలా సినిమా విజయవంతం కావడంతో గోల్డెన్ లెగ్ గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న జెనీలియా డబ్బు కంటే నిజాయితీ ముఖ్యం అంటున్నారు. డబ్బు వస్తుంది కదా అని అన్ని పాత్రలు ఒప్పుకోలేనని తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చింది. డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలున్నాయని కాని ఎలా సంపాదించమన్నదే ముఖ్యం అని చెప్పింది. ప్రస్తుతం జెనీలియా రానా తో నటించిన ‘నా ఇష్టం’ చిత్రంలో నటిస్తున్నారు.

రియల్ ఎస్టేట్ సమస్యల్లో సునీల్


కామెడీ హీరో కొన్ని రియల్ ఎస్టేట్స్ సమస్యల్లో ఇరుక్కున్నాడు. కంగారు పడకండి అతని నిజ జీవితంలో కాదు. సునీల్ హీరోగా నటించిన ‘పూలరంగడు’ చిత్రంలోని అతని పాత్ర గురించి చెప్తున్నాం. ఈ చిత్రంలో సునీల్ పాత్ర రియల్ ఎస్టేట్ బిజినెస్ లో బాగా సంపాదించి తరువాత రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయి ఏం చేయాలో తెలియని పరిస్తుతుల్లో ఏం చేసాడనేది చిత్ర కథ. ఫిబ్రవరి 3న విడుదల కాబోతుంది. అనూప్ రూబెన్స్ అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 15న విడుదల కాబోతుంది.

ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా ఫిబ్రవరికి వాయిదా పడింది. సునీల్, ఇషా చావ్లా జంటగా నటించిన ఈ చిత్రానికి వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. మాక్స్ ఇండియా బ్యానర్ పై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. కోట శ్రీనివాస్ రావు, ప్రదీప్ రావత్, అలీ, రఘుబాబు మరియు ప్రగతి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

అమెరికాలో ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’ … అదోలా


ధర్మ పధ క్రియేషన్స్ పతాకం ఫై ‘ గౌతమ బుద్ధ’ చిత్రాన్ని నిర్మించి, నంది అవార్డ్ అందుకొన్న అభిరుచిగల నిర్మాత కే. రాజ శేఖర్ మలి ప్రయత్నం గా అమెరికా నేపధ్యం లో సాగే చక్కటి ప్రేమ కధా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ మై హార్ట్ ఈజ్ బీటింగ్’ […అదోలా] అనే పేరు తో నిర్మిస్తున్న ఈ చిత్రం అమెరికాలోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకుందని , ఈచిత్రాన్ని పూర్తిగా అమెరికాలోనే చిత్రీకరించడం విశేషం అని నిర్మాత కే. రాజ శేఖర్ చెప్పారు. కేవలం ప్రేమకే పరిమితం కాకుండా …బాధ్యతలను కూడా గుర్తు చేస్తూ పిల్లలు ,తల్లి దండ్రుల మధ్య మనసుని హత్తుకునేలా సన్నివేశాలను చేసామని చెప్పారు.

రెండు గంటల పాటు అమెరికా అందాలతో కనుల పండువగా ఉండే ఈ చిత్రం లో – అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ‘ న్యూ యార్క్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్’ లో శిక్షణ పొందిన వారు నటించారని , ప్రధాన జంటగా చేసిన రేవంత్-రాజిత మంచి నటన ప్రదర్శించారని చెప్పారు. అరుణ్ రుద్ర- కిరణ్ మీగడ ప్రతిభా వంతంగా చిత్రాన్ని రూపొందించారని చెప్పారు. ప్రస్తుతం రీ – రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం మైఖేల్ మక్కల్ మెలోడితో కూడిన 7 మధుర మైన పాటలు అందించారని ….ఈ నెలాఖరు లో పాటలు విడుదల చేసి, ఫిబ్రవరి రెండవ వారం లో సినిమాని విడుదల చేస్తామని చెప్పారు.

రేవంత్, రాజిత , కే.రాజ శేఖర్ , శ్రీని కొల్లా, సరయు సిరి, రజనీ కాంత్, ఫణి , మార్క్, రేష్మి ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కధ: అరుణ్ రుద్ర, ఫోటో గ్రఫీ: మురళి పలికొండ, సంగీతం : మైఖేల్ మక్కల్ , కొరియో గ్రఫీ:శివ సాయి, స్క్రీన్ ప్లే- దర్శకత్వం : అరుణ్ రుద్ర- కిరణ్ మీగడ , నిర్మాత :కే. రాజ శేఖర్

అధినాయకుడు ట్రాక్ లిస్ట్

బాలకృష్ణ రాబోతున్న చిత్రం “అధినాయకుడు” భారి విడుదలకు సిద్దమయ్యింది.

తదుపరి షెడ్యూల్ ఉత్తరాకండ్ లో జరుపుకోనున్న “రొటీన్ లవ్ స్టొరీ”

“రొటీన్ లవ్ స్టొరీ ” చిత్రం తదుపరి షెడ్యూల్ ఉత్తరాఖండ్ లో జరుపుకోనుంది.

మరో చిత్రం చెయ్యబోతున్న చిన్మయి ఘట్రాజు

చిన్మయి ఘట్రాజు ఎట్టకేలకు రెండో చిత్రం చెయ్యబోతుంది గతం లో ఎల్.బి.డబ్ల్యు

బుల్లి తెరలోకి ప్రవేశించబోతున్న ఆశిన్

జెనిలియా తరువాత ఇప్పుడు అసిన్ బుల్లితెర లో కి ప్రవేశించబోతుంది .

హీరోయిజం మారింది: పూరి జగన్నాధ్

ఈ రోజుల్లో ప్రేక్షకులు విలేజ్ లో ప్రెసిడెంటు లాంటి కథలు అంగీకరించట్లేదు.

జనవరి 20న విడుదలవుతున్న ‘అయ్యారే’

శివాజీ నటించిన ‘అయ్యారే’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో ప్రముఖ బాబా ‘నిత్యానంద స్వామి’ జీవిత చరిత్ర పై తెరక్కించారు.

‘నిప్పు’ లో ఓన్లీ యాక్షన్ నో వాయిలెన్స్

రవితేజ నటించిన ‘నిప్పు’ చిత్రం యాక్షన్, రొమాన్స్, మరియు కామెడీ కలగలిపిన చిత్రం అని చెప్తున్నారు చిత్ర నిర్మాత వైవీఎస్ చౌదరి.

పాత్ర వైఖరి మీదే నడిచే “గబ్బర్ సింగ్”

“దబాంగ్” విడుదలయిన మొదట్లో విమర్శకులు రొటీన్ చిత్రమని తీసి పారేశారు కాని అందులో సల్మాన్ నటన మరియు అతని పాత్ర నడిచే ధోరణి అందరిని ఆకట్టుకుంది.

డీటీఎస్ మిక్సింగ్ లో బిజినెస్ మేన్

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘బిజినెస్ మేన్’ ఈ నెల 13 న భారీగా విడుదలకు సిద్ధమవుతుంది.

“ఢిల్లీ బెల్లీ” రిమేక్ లో నాగ చైతన్య?


ఒక ప్రముఖ పత్రికా కథనం ప్రకారం తమిళ దర్శకుడు కన్నన్ నాగ చైతన్య ని “ఢిల్లీ బెల్లీ” చిత్ర రిమేక్ కోసం కలిసాడు. గతం లో ఈ చిత్రం లో ప్రధాన పాత్ర శింభు చేస్తున్నాడు అని చెప్పగా ఇపుడు జయం రవి చేస్తున్నారు అంటున్నారు. నిర్మాతలు తెలుగు మరియు తమిళం లో ఈ చిత్రాన్ని చెయ్యాలి అనుకుంటున్నారు తెలుగు లో ఈ పాత్రను నాగ చైతన్య ని అడిగారు. జయం రవి మరియు నాగ చైతన్య ఇద్దరు ఈ చిత్రం లో నటించవచ్చు అనే పుకారు కూడా ఉంది. ఇది పుకారు మాత్రమే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. ప్రస్తుతం నాగ చైతన్య రాధామోహన్ దర్శకత్వం లో ద్విభాషా చిత్రం చేస్తున్నారు మరియు దేవ్ కట్టా దర్శకత్వం లో “ఆటో నగర్ సూర్య” చిత్రం కూడా చేస్తున్నారు.

“నా ఇష్టం” షూటింగ్ పూర్తి చేసుకున్న జెనిలియా


జెనిలియా “నా ఇష్టం” చిత్రం లో తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం చిత్రీకరణ కోసం రానా మరియు జెనిలియా రెండు పూటలు పని చేసారు.రానా ఈ నెల 13 వరకు రామోజీ ఫిలిం సిటీ లో జరిగే షూటింగ్ లో పాల్గొంటారు.ప్రకాష్ తోలేటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. జెనిలియా ప్రకాష్ గురించి ట్విట్టర్ లో చెపుతూ “ప్రకాష్ మంచి ప్రతిభ కలిగిన దర్శకుడు తనకు ఏం కావాలో తనకు తెలుసు అలాంటి ప్రతిభ కలిగిన దర్శకుడితో పని చెయ్యటం చాలా ఆనందంగా ఉంది”. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నారు. పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.

సునీల్ ఇంట్లో షూటింగ్ జరుపుకోనున్న ప్రభాస్


త్వరలోనే ప్రభాస్ హాస్య కథానాయకుడు సునీల్ ఇంట్లో షూటింగ్ జరుపుకోనున్నారు. ఆశ్చర్యపోకండి సునీల్ “మర్యాద రామన్న” చిత్రం కోసం వాడిన ఇంట్లోనే ప్రభాస్ చిత్రం “వారధి” ఈ నెల 16 నుండి చిత్రీకరణ జరుపుకోనుంది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ్ ఈ చిత్రం లో ప్రభాస్ సరసన నటిస్తున్నారు. ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశీ కృష్ణ ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో బలమయిన కథ ఉండటంతో పాటు ప్రభాస్ కొత్త రకమయిన పాత్రలో కనిపించబోతున్నారు. కొరటాల శివ ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

విడుదల తేది ఖరారు చేసుకున్న నితిన్-నిత్యా ల “ఇష్క్”


నితిన్ మరియు నిత్యా మీనన్ ల కలయిక లో వస్తున్న “ఇష్క్” చిత్రం ఫిబ్రవరి 10 న విడుదలకు సిద్దమయింది. ఈ చిత్రాన్ని శ్రేష్ట మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రఖ్యాత ఛాయా గ్రాహకుడు పి.సి.శ్రీరాం సినిమాటోగ్రఫీ అందించారు. ఈ మధ్యనే ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్ర ఆడియో ఈ నెల 15 న కాని 16 న కాని జరుపుకోనుంది.

ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. ఈ ప్రేమ కథ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన పి.సి.శ్రీరాం గారు చిత్ర విజయం పై చాలా ధీమాగా ఉన్నారు. నితిన్ కి కూడా విజయం వచ్చి చాలా రోజులు అయ్యింది ఈ చిత్రం తో అయిన విజయం సాదించాలి అని నితిన్ అనుకుంటున్నారు.

పౌరాణిక పాట పాడుకోబోతున్న ఎన్.టి.ఆర్, త్రిష


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనేర్ “దమ్ము” సినిమా అభిమానులను మరియు ఎన్.టి.ఆర్ అభిమానులను అలరించడానికి సిద్దమవుతుంది. ఈ చిత్రం లో ఎన్.టి.ఆర్ నృత్యాలను,పోరాటాలను,డైలాగు ల ను పూర్తి గా చూడవచ్చు. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్ర విజయం కోసం చిన్న విషయాన్నీ కూడా వదలట్లేదు. ఈ చిత్రం లో ఒక పౌరాణిక పాట ఉండబోతున్నది అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. పౌరాణిక దుస్తులలో ఎన్.టి.ఆర్. మరియు త్రిష ల ను చూడవచ్చు. కీరవాణి స్వరపరచిన పాటలు అద్బుతంగా ఉన్నాయని రాజమౌళి గతం లో నే చెప్పారు.కార్తీక రెండవ కథానాయికగా చేస్తున్నారు. అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా క్రియేటివ్ కమర్షియల్స్ పతాకం పై కే.ఎస్.రామా రావు సమర్పిస్తున్నారు. ఈ చిత్రం 2012 వేసవి లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ప్రభాస్ చిత్రాన్ని రీమేక్ చెయ్యబోతున్న అల్లు శిరీష్


కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ తమ్ముడు అయిన అల్లు శిరీష్ తమిళ చిత్ర రంగం లో కి “100 % లవ్” లేదా “మిస్టర్ పెర్ఫెక్ట్” చిత్రాలలో ఏదో ఒక చిత్ర రీమేక్ తో తమిళ చిత్ర రంగం లో కి ప్రవేశించబోతున్నారు అని చెప్పాము. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అల్లు శిరీష్ తమిళ చిత్ర పరిశ్రమ లో కి ప్రభాస్ నటించిన “మిస్టర్ పెర్ఫెక్ట్” చిత్రం రీమేక్ తో ప్రవేశించబోతున్నారు. 2011 లో మిస్టర్ పెర్ఫెక్ట్ చిత్రం మంచి విజయం సాదించిన చిత్రం ఈ చిత్రం లో ప్రభాస్ మరియు కాజల్ ప్రధాన పాత్రలు పోషించారు.

శిరీష్ చెయ్యబోతున్న చిత్రానికి కొత్త కథానాయిక ను ఎంపిక చేసుకోబోతున్నారు. ప్రస్తుతం అల్లు శిరీష్ ముంబై లో నటన లో శిక్షణ పొందుతున్నారు. ఈ చిత్రం తో మెగా కుటుంబం నుండి మరొక కథానాయకుడు వస్తున్నారు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన త్వరలోనే చేస్తారు.

సంక్రాంతి కి విడుదల కానున్న “రచ్చ” ఫస్ట్ లుక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రాబోవు చిత్రం “రచ్చ” 2012 వేసవి లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ చిత్రం “ఫస్ట్ లుక్” సంక్రాంతి కి విడుదల చెయ్యబోతున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. రామ్ చరణ్ చేసిన పోరాట సన్నివేశాలు అద్బుతంగా వచ్చాయి అని చెబుతున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఎన్వీ ప్రసాద్ మరియు పరాస్ జైన్ లు నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం చైనా,బ్యాంకాక్ మరియు శ్రీ లంక లో కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. చరణ్ మరియు తమన్నా ఈ చిత్రం లో వైద్య విద్యార్థులుగా నటిస్తున్నారు.

రవి తేజ మరియు తాప్సీ ల “దరువు”


మాస్ మహారాజ రవితేజ మరియు తాప్సీ ప్రధాన పాత్రల లో చేస్తున్న చిత్రం “దరువు”. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు గతం లో శౌర్యం,శంఖం వంటి చిత్రాలకు శివ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై బురుగుపల్లి శివ రామ కృష్ణ నిర్మిస్తున్నారు. 2012 మధ్యలో విడుదల కానున్న ఈ చిత్ర చిత్రీకరణ వేగంగా జరుపుకుంటుంది. రవి తేజ ఈ చిత్రం లో విభిన్న కోణాలున్న పాత్రను చేస్తున్నారు. బ్రహ్మానందం ఈ చిత్రం లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రం ఇది అని పేరు చూస్తుంటేనే తెలుస్తుంది. ఇది రవి తేజ మరియు తాప్సీ జంటగా చేస్తున్న రెండవ చిత్రం గతం లో వీరు ఇద్దరు కలిసి “వీర” చిత్రం లో నటించారు.

నేనొక పెద్ద తుంటరిని – కాజల్


నేనొక పెద్ద తుంటరిని అంటోంది అందాల భామ కాజల్ అగ్గార్వాల్. చిన్నతనం లో ఆమె విపరీతమైన అల్లరి చేసి స్కూల్ లో మాస్టార్లకు బాగా పని కల్పించేది అట. ఈ విషయాన్నీ స్వయం గా కాజల్ వెల్లడించింది.

“చిన్న తనం లో విపరీతం గా అల్లరి చేసేదాన్ని. స్కూల్ లో మంచి ఆకతాయి గ పేరు ఉండేది. ఎప్పుడు కుదురుగా కుర్చునేదాన్ని కాదు. అంతే కాకుండా నాటకాలు, ఆట పాట ల లో ఎప్పుడూ ముందు ఉండే దాన్ని. బహుశా సినీ పరిశ్రమ లో కి అడుగుపెట్టాలని నాకు రాసి పెట్టి ఉందేమో.”, అంటోంది ఈ అందాల భామ.

త్వరలో ప్రిన్స్ మహేష్ బాబు సరసన కాజల్ తళుక్కు మనిపించాబోతోంది. జనవరి 13 న విడుదల కాబోతున్న ‘బిజినెస్ మాన్ ‘ చిత్రం కాజల్ హీరోయిన్.

ఇంటర్వ్యూ : పూరీ జగన్ – ” నమ్రత అనుమతి తోనే మహేష్ ముద్దు సీను”

మహేష్ బాబు-కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘బిజినెస్ మేన్’ చిత్రం షూటింగ్ మరియు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు దగ్గర పడింది.

సమీక్ష: బూతు బాచిలర్స్

విడుదల తేది : 06 జనవరి 2012
123 తెలుగు .కామ్ రేటింగ్ : 1.25/5
డైరెక్టర్ :  జకీర్
ప్రొడ్యూసర్ :  మై  హుస్సేన్ ,  వై . శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ : సందీప్
నటీ నటులు: జకీర్, అజయ్, శాంతి, అప్పు, విక్కీ, నిఖిల్,  అలీ

గతంలో బాచిలర్స్ అనే సినిమా తీసి ఒక వర్గం ప్రేక్షకులను అలరించిన చిత్ర దర్శకుడు జకీర్ హీరోగా నటించి తానే స్వయంగా డైరెక్ట్ చేసిన చిత్రం బాచిలర్స్-2. ఎమ్.వై. హుస్సేన్ మరియు వై.శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే విడుదలవగా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

జీవా (జీవా) మరియు అతని గ్యాంగ్ స్వామినాథన్ అనే ఒకాయన కూతురుని కిడ్నాప్ చేస్తారు. ఈ కిడ్నాప్ గ్యాంగ్ ని పట్టుకోవడానికి ఏసీపి సత్య ప్రయత్నిస్తుంటాడు. అజయ్ (అవీన్) , అప్పు (త్రుప్తి శర్మ) , విక్కీ (జకీర్), నిఖిల్ (సుమిత్ రాయ్) నలుగురూ ప్రాణ స్నేహితులు హైదరాబాదులోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఒకసారి పార్టీలో ఎంజాయ్ చేస్తూ తాగిన మైకంలో అనుకోని ప్రమాదంలో ఇరుక్కుంటారు. ఆ ప్రమాదం నుండి బయట పడే క్రమంలో జీవా గ్యాంగ్ కిడ్నాప్ చేసిన కేసులో ఇరుక్కుంటారు. ఈ ప్రమాదాల నుండి ఎలా బయట పడ్డారు అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

హీరోగా విక్కీ పాత్రలో చేసిన జకీర్ కి నటనలో కొంత అనుభవం ఉండటంతో కొంత వరకు పర్వాలేదనిపించాడు. అజయ్ గా అవీన్ కూడా పర్వాలేదనిపించాడు. హీరోయిన్ శాంతి కూడా ఆమె స్థాయికి తగ్గట్లు బాగానే చేసింది. అలీ 4 విభిన్నమైన గెటప్ లలో కనిపించి నవ్వించడానికి ప్రయత్నించాడు కాని అస్సలు నవ్వించలేకపోయాడు.

మైనస్ పాయింట్స్:

అప్పు పాత్ర చేసిన త్రుప్తి శర్మ నటన అస్సలు బాగాలేకపోగా బూతు డైలాగులు చెప్తూ చిరాకు తెప్పించాడు. నిఖిల్ గా నటించిన సుమిత్ రాయ్ ఇతనికి నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. ఇచ్చిన నాలుగైదు సన్నివేశాలు అస్సలు బాగా చేయలేకపోయాడు. ఏసీపి సత్య ఈయనను ఎందుకు తీసుకున్నారో దర్శకుడికే తెలియాలి. మిగతా నటులందరూ సి గ్రేడ్ స్థాయిలో ఉన్నారు.

సాంకేతిక వర్గం:

చిత్ర దర్శకుడు జకీర్ సినిమా తీయడం కంటే బూతు మీద బాగా ఇంట్రెస్ట్ చూపించాడు. సెన్సార్ వారు కూడా చాలా డైలాగులు కత్తెర వేసారు. డైలాగులు కూడా చాలా వరకు బూతు పురాణం. ఎడిటింగ్ మరియు సినిమాటోగ్రఫీ రెండు అస్సలు బాగాలేవు. పాటల విషయానికి వస్తే కొన్ని హిందీ పాటల మ్యూజిక్ ఉన్నది ఉన్నట్లు అలాగే వాడుకున్నారు.

తీర్పు:

ఒక వర్గం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసారు. సెన్సార్ వారు కూడా బాగా కత్తెర్లు వేయడంతో పాపం వారిని కూడా చేరుకోలేకపోయింది.

అశోక్ రెడ్డి. ఎమ్

123తెలుగు.కాం రేటింగ్: 1.25/5

Bachelors 2 Review English Version

ఊ. కొ. ఉ. ప. తో టాలివుడ్ లో కి ప్రవేశించాబోతున్న సైమర్ మోతియాని

సైమర్ మొతియని మోడలింగ్ నుండి నటన వైపు వచ్చిన నటి మంచు మనోజ్ చేస్తున్న “ఊ కొడతార ఉలిక్కి పడతార” చిత్రం

కోల్ కత్తా నుండి తిరిగి వచ్చిన రిచా

ఈ మధ్యనే రిచా గంగోపాధ్యాయ్ తన మొదటి బెంగాలి చిత్ర షూటింగ్ ని పూర్తి చేసుకొని కోల్ కత్తా నుండి తిరిగి వచ్చింది.

విక్రమ్ సరసన నటించబోతున్న టబు

తన కెరీర్ లో మొదటిసారిగా టబు విక్రమ్ సరసన హిందీ చిత్రం లో నటిస్తున్నారు.