సమీక్ష : లవ్ ఫెయిల్యూర్ – ఒక వర్గం వారిని మాత్రమే ఆకట్టుకునే సినిమా

Published on Feb 17, 2012 7:50 pm IST
విడుదల తేది : 17 ఫిబ్రవరి 2012
123తెలుగు.కాం రేటింగ్: 2.75/5
దర్శకుడు : బాలాజి మోహన్
నిర్మాత :ఎస్.శశికాంత్, సిద్ధార్థ్, నీరవ్ షః
సంగిత డైరెక్టర్ : తమన్
తారాగణం : సిద్దార్థ్ ,అమలా పాల్

సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో నటిస్తూ నిర్మాతగా ఇటాకి బ్యానర్ పై నిర్మించిన మొదటి చిత్రం లవ్ ఫెయిల్యూర్. సిద్ధార్థ్ కి జోడీగా అమలా పాల్ నటించగా తమన్ సంగీతం అందించారు. అలాగే దర్శకుడు బాలాజీ మోహన్ కి కూడా ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

మొదటి సన్నివేశంలోనే పూర్ణిమ (అమలా పాల్) మరియు అరుణ్ (సిద్ధార్థ్) విడిపోతారు. ఎందుకు విడిపోయారు అన్నది తరువాతి సన్నివేశం నుండి చూపించే ప్రయతనం చేస్తాడు. అసలు అరుణ్, పూర్ణిమ ఎందుకు విడిపోయారు? వాళ్ళ తల్లితండ్రుల పాత్ర నేతవరకు ఉంది. వీరి తో పాటు వీరి స్నేహితుల ప్రేమకథలను కూడా చూపిస్తూ మొదటి భాగం వరకు సాగింది. రెండవ భాగం మొత్తం సమస్యను పరిష్కరించే విధంగా సాగుతుంది. ఎవరి జోక్యం లేకుండా ప్రేమ జంట ఒక్కటి కావడంతో ఈ ప్రేమకథ ముగుస్తుంది.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో డైలాగ్స్ మరియు చిత్ర కథనం ప్రేక్షకుడిని కూర్చోబెట్టేలా చేస్తాయి. చిత్రంలోని అన్ని పాత్రలు మనం రోజు మాట్లాడుకునే వాడుక భాషలోనే మాట్లాడుకుంటాయి. దర్శకుడు దాని నుండి కామెడీ రాబట్టాడు. చిత్రం వేగంగా సాగుతూ ఎక్కడ బోర్ కొట్టించకుండా సాగుతుంది. సిద్ధార్థ్ మొదటి బాగంలో బాగా నటించాడు. అతనికి ఇలాంటి పాత్రలు ఎన్నో నటించాడు కాబట్టి కొట్టిన పిండి లాగా చేసాడు. అమలా పాల్ కూడా బాగా నటించింది. ఇతర పాత్రల్లో నటించిన వారు కూడా వారి పరిధి మేరకు బాగా నటించారు. తమన్ సంగీతంలో మూడు పాటలు బావున్నాయి.

మైనస్ పాయింట్స్:

చిత్ర రెండవ భాగంలో మెయిన్ కథని వదిలేసి పక్క దారులు పడుతుంది. అలాగే ఇలాంటి సినిమాలు కాలేజ్ స్టూడెంట్స్ ని మాత్రమే ఆకర్షిస్తాయి. మాస్ ప్రేక్షకులను ఆకర్షించే అంశాలు అస్సలు లేకపోవడం విచారకరం. చిత్ర రెండవభాగంలో కొన్ని సన్నివేశాలకి కత్తెర వేసి ఉంటే బావుండేది. సినిమాలో కమర్షియల్ అంశాలు లేకపోవడం కూడా మైనస్ అని చెప్పుకోవాలి.

తీర్పు:

లవ్ ఫెయిల్యూర్ కాలేజ్ స్టూడెంట్స్ మరియు మల్టిప్లెక్స్ ఆడియెన్స్ కి మాత్రమే నచ్చే సినిమా. అలాగే సిద్ధార్థ్ సినిమాలు నచ్చే వారికి కూడా నచ్చుతుంది. మీరు విభిన్నమైన ప్రేమకథలు కోరుకుంటే తప్పక చూడండి.

కొస మెరుపు:

దర్శకుడు బాలాజీ మోహన్ చివర్లో క్లైమాక్స్ లో తలుక్కున మెరిసాడు.

123తెలుగు.కామ్ రేటింగ్: 2.75/5

అనువాదం :అశోక్ రెడ్డి. ఎమ్

Clicke Here For ‘Love Failure’ English Review

సంబంధిత సమాచారం :