ఆడియో రివ్యూ : “ఓ మై ఫ్రెండ్” = ఫ్రెష్ యూత్ ఫుల్ మెలోడీస్

ఆడియో రివ్యూ : “ఓ మై ఫ్రెండ్” = ఫ్రెష్ యూత్ ఫుల్ మెలోడీస్

Published on Oct 24, 2011 4:04 AM IST

‘బొమ్మరిల్లు’ తరహా మ్యాజిక్ మళ్లీ చేసేందుకు హీరో సిద్ధార్థ్, నిర్మాత దిల్ రాజు జత కట్టారు. ‘ఓ మై ఫ్రెండ్’ పేరుతో వస్తున్నఈ సరికొత్త చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. నవదీప్, హన్సికలు ఈ మూవీ లో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం శిల్ప కళావేదికలో జరిగింది. మలయాళం సంగీత దర్శకుడు రాహుల్ రాజ్ ఈ చిత్రం ద్వారా తొలిసారి తెలుగు తెరకు తన బాణీలు అందించారు. ఈ మూవీ ఆల్బం లో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి. వీటి తీరు తెన్నులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం .

1. సాంగ్ : ఓ మై ఫ్రెండ్
గాయకుడు / సింగర్స్ : కార్తీక్
రచయిత : కృష్ణ చైతన్య

ఈ ఫాస్ట్ బీట్ సోలో సాంగ్ అద్భుతంగా ఉంది. కార్తీక్ పాడిన తీరు శ్రేవనానందాన్ని కలిగిస్తుంది. ఈ సాంగ్ కు రాహుల్ రాజ్ అందించిన మ్యూజిక్ తాజా అనుభూతిని ఇస్తుంది. కృష్ణ చైతన్య రచన చాల డీసెంట్ గా ఉంది.

2. సాంగ్ : నువ్వు నేను జట్టు
గాయకుడు / సింగర్స్ : బెన్నీ దయాళ్
రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి

ఇదో మంచి శృంగార గీతం. సంగీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన బావున్నాయి. ఈ సాంగ్ ప్రధానంగా హీరో – హీరోయిన్ ల మధ్య శృంగార సన్నివేశాలకు ఆలంబనగా కనిపించే అవకాశం ఉంది.

3.సాంగ్ : శ్రీ చైతన్య
గాయకుడు / సింగర్స్ : సిద్ధార్థ్, శృతి హాసన్
రచయిత : కృష్ణ చైతన్య


సిద్ధార్థ్ మరియు శృతి హాసన్ పాడిన ఈ పాట వినసొంపుగా ఉంది. ఈ సాంగ్ వింటుంటే ‘బొమ్మరిల్లు’ సినిమాలోని ‘ఉయ్ హేవ్ ఎ రోమియో’ గీతం జ్ఞప్తికి వస్తుంది. విద్యార్ధి జీవితంలోని మధుర స్మృతులను గుర్తు చేసేలా ఈ పాట సాగుతుంది. ఈ పాటకు కృష్ణ చైతన్య అందించిన సాహిత్యం బావుంది. ఈ పాటను తెరపై చూసినప్పుడు ఆహ్లాదంగా కనిపించే అవకాశం ఉంది. మ్యూజిక్ ఓకే.

4.సాంగ్ : ఆలోచన వస్తేనే
గాయకుడు / సింగర్స్ : రంజిత్, సంగీత ప్రభు, సారా స్ట్రాయుబ్
రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి

ఈ ఆల్బమ్ లో మరో అద్భుతమైన పాట ఇది. ఈ సాంగ్ కు అన్ని విభాగాలనుంచీ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ కనిపించే అవకాశం ఉంది. రంజిత్ , సంగీత ప్రభు, సారా స్ట్రాయుబ్ గానం రాక్ చేసింది. ఈ పాట కు రొమాంటిక్ ఫీల్ తేవటంలో వీరి ప్రతిభ కొట్టొచ్చినట్టు కనబడింది. అటు సీతారామ శాస్త్రి లిరిక్స్ ఎప్పుడూ అద్భుతంగానే ఉంటాయనుకోండి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసింది రాహుల్ రాజ్ సంగీత గురించి. ఈ పాటలో రాహుల్ అందించిన మ్యూజిక్.. మోడరన్, మెలోడీ కలగలిపిన ఆధునిక మిశ్రమం గా ఉంది. ఈ పాట చాలా ఈజీగా మీ ఐపాడ్ లోని ‘అల్ టైం ఫేవరేట్స్’ ఫోల్డర్ లో చోటు దక్కించు కుంటుంది.

5.సాంగ్ : వేగం వేగం
గాయకుడు / సింగర్స్ : బెన్నీ దయాళ్, కవిత మోహన్, జయరాం రంజిత్ , డెస్మండ్ ఎఫ్ (ర్యాప్)
రచయిత : కృష్ణ చైతన్య


ఇది ఒక యూత్ ఫుల్ సాంగ్. ఫ్రెండ్స్ అంతా కలసి ప్రయాణిస్తున్న సందర్భంలోనిది. వేగంగా సాగే ఈ పాటలో గాయనీ, గాయకుల ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణ చైతన్య రచన భావత్మకంగా ఉంది. సంగీతం అద్భుతంగా లేకున్నా డీసెంట్ గా ఉంది.

6.సాంగ్ : నేను తానని
గాయకుడు / సింగర్స్ : రంజిత్
రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి

ఇది ఎమోషనల్ సాంగ్. హీరో, అతని గర్ల్ ఫ్రెండ్ మధ్య గల స్నేహాన్ని అపార్థం చేసుకుంటున్నారన్న ఒక భావోద్వేగభరిత పాట. సీతారామ శాస్త్రి యొక్క శక్తివంతమైన భావాల వెల్లడికి రంజిత్ గానం సరిగ్గా సరిపోయింది. సంగీతం ప్రేక్షకులను హృదయనుభూతిని కలిగిస్తుంది. ఈ పాట బహుశా సినిమాలో చాలా క్లిష్టమైన సమయంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది.

7.సాంగ్ : మా డాడీ పోకేట్స్
గాయకుడు / సింగర్స్ : సిద్ధార్థ్
రచయిత : కృష్ణ చైతన్య


ఈ పాటను కూడా సిద్ధార్థ్ ఆలపించాడు. సంగీతం విషయంలో ఎలక్ట్రానిక్ గిటార్ ఆధిపత్యం కనిపిస్తుంది. దరువు వాయిద్యాలు బావున్నాయి. ఈ పాట కళాశాల సంగీత పోటీల ఫైనల్ సందర్భంలో వచ్చేటట్టు ఉంది. సిద్ధార్థ్ గానం శ్రావ్యంగా ఉంది. కృష్ణ చైతన్య యొక్క సాహిత్యం గురించి చెప్పాలంటే మాటలు చాలవు.

తీర్పు : మొత్తంగా, ‘ఓ మై ఫ్రెండ్’ పాటలు తాజా అనుభూతిని కలిగిస్తాయి. ఆల్బమ్ లో కొన్ని అద్భుతమైన పాటలు ఉన్నాయి. మలయాళం సంగీత దర్శకుడు రాహుల్ రాజ్ ఈ సినిమాతో తెలుగు తెరకు ఒక మంచి సంగీత దర్శకుడిగా అవతరించారు. ‘ఆలోచన వస్తేనే’, ‘ఓ మై ఫ్రెండ్’ మరియు ‘నేను తానని’ నాకు బాగా నచ్చిన గీతాలు. సిద్ధార్థ్, దిల్ రాజు చేతుల నుంచి జాలువారిన మరో మ్యూజికల్ విన్నర్ ఈ ఆల్బం.

– నారాయణ ఎ.వి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు