ఆడియో సమీక్ష : ఊసరవెల్లి – కొత్తదనం కోసం ప్రయత్నించిన ఎన్.టి.ఆర్

ఆడియో సమీక్ష : ఊసరవెల్లి – కొత్తదనం కోసం ప్రయత్నించిన ఎన్.టి.ఆర్

Published on Oct 18, 2011 10:34 AM IST

ఎన్.టి.ఆర్, తమన్నా కలిసి నటించిన చిత్రం ఊసరవెల్లి. సురేందర్ రెడ్డి దర్సకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించాడు. మొత్తం ఎనిమిది పాటలు ఉన్నాయి ఈ చిత్రం లో . పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం.

పాట: నేనంటే నాకు
గాయకులు: అద్నాన్ సామీ
మాటలు: రామ జోగయ్య శాస్త్రి

ఈ చిత్రం లో ఉన్న మంచి పాటల లో ఇది ఒకటి. అద్నాన్ సామి చక్కగా ఆలపించాడు. దేవి శ్రీ సంగీతం బాగుంది. రామ జోగయ్య శాస్త్రి మాటలు అందం గా ఉన్నాయి. హీరో హీరోయిన్ ను ప్రేమ లో పడేయటానికి పాడే పాట ఇది. చిత్రీకరణ అద్భుతం గ ఉంటుందని అనుకోవచ్చు.

 

పాట: నిహారిక నిహారిక
గాయకులు: విజయ్ ప్రకాష్, నేహ భాసిన్
మాటలు: అనంత శ్రీరామ్

ఇది చిత్రం లోనే అత్యుత్తమ పాట. నేహా భాసిన్ గాత్రం అమోఘం. విజయ్ ప్రకాష్ కుడా బాగానే పాడాడు. అనంత శ్రీరామ్ సాహిత్యం వినసొంపు గా ఉంటుంది. దేవి శ్రీ పాటకు చక్కటి సంగీతాన్ని

అందించాడు. ఈ పాట ప్రేక్షకుల మది లో చాలా కాలం నిలిచి ఉంటుంది.

పాట: ఊసరవెల్లి థీమ్
గాయకులు: ఉజ్జయిని రాయ్
మాటలు: రామ జోగయ్య శాస్త్రి, దేవి శ్రీ

ఇది చిత్రం లోని థీమ్ సాంగ్. పాట కాస్త విచిత్రం గా ఉంటుంది. తెర మీద చూడటానికి ఎలా ఉంటుందో తెలియది కానీ వినటానికి మాత్రం అంత బాగోదు.ముఖ్యం గా బి.సి. సెంటర్ల లో పాట కాస్త ఎక్కటం కష్టమే . దేవి శ్రీ సంగీతం కాస్త అమెరికన్ స్టైల్ లో ఉంటుంది. ఉజ్జయిని రాయ్ గాత్రం కాస్త ఎబ్బెట్టు గా ఉంటుంది.

పాట: శ్రీ ఆంజనేయం
గాయకులు: ఎం ఎల్ ఆర్ కార్తికేయన్
మాటలు: సిరి వెన్నెల సీత రామ శాస్త్రి

సీతారామ శాస్త్రి సాహిత్యం ఎంతో బలం గా ఉంటుంది. హీరో కష్టాలలో ఉన్నప్పుడు ఉత్సాహాన్ని నింపే పాట ఇది. ఆంజనేయ స్వామి ని కీర్తిస్తూ పాడే ఈ పాటను కార్తికేయన్ చక్కగా ఆలపించాడు. దేవి శ్రీ సంగీతం పర్వాలేదు

పాట: ఎలంగో ఎలంగో
గాయకులు: జస్ప్రీత్ ,చిన్మయి
మాటలు: రామ జోగయ్య శాస్త్రి

ఈ పాట కొంత మందికి నవ్వు ని తెస్తుంది. మరి కొంత మందికి కోపం తెప్పిస్తుంది. అర్ధం పర్ధం లేని ఈ పాట వింటే అంతే మరి. మంచి మాస్ బీట్ ఉండటం తో ఇది ఎన్.టి.ఆర్. డాన్సు కి బాగా ఉపయోగ పడుతుంది.దేవి శ్రీ సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది.

పాట: బ్రతకాలి
గాయకులు: దేవి శ్రీ ప్రసాద్
మాటలు: చంద్రబోసు

ఇది ఊసరవెల్లి థీమ్ సాంగ్ కు తరువాయి భాగం లాగా ఉంటుంది. దేవి శ్రీ గాత్రం, సంగీతం రెండు పర్వాలేదు అనిపిస్తాయి. హీరో మీద చిత్రీకరించే ఈ పాట మీద సురేందర్ రెడ్డి చిత్రీకరణ ఎలా ఉంటుందో చూడాలి. పాట ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. చంద్రబోసు సాహిత్యం పరవాలేదు అనిపిస్తుంది.

పాట: దాన్డియా ఇండియా
గాయకులు: ముకేష్, సుచిత్ర
మాటలు: అనంత శ్రీరామ్

ఈ పాట మంచి ఊపు తో సాగుతుంది. ఎన్.టి.ఆర్. డాన్సు వెయ్యటానికి ఈ పాట చక్కగా ఉపయోగపడుతుంది. దేవి శ్రీ సంగీతం పాట ఊపుకి మంచి సహకారాన్ని అందిస్తుంది. అనంత శ్రీరామ్ సాహిత్యం పర్వాలేదు అనిపిస్తుంది. పాట ఖచ్చితం గా పల్లెటూర్ల లో మరియు చిన్న పట్నాలలో దుమ్ము లేపుతుంది.

పాట: లవ్ అంటే కేరింగ్
గాయకులు: ఫ్రాన్సిస్కో
మాటలు: అనంత శ్రీరామ్

ఈ చిత్రానికి ఊసరవెల్లి అనే పేరు ఎందుకు పెట్టారు అనేది ఈ పాట వింటే అర్ధం అవుతుంది.హీరో తన స్వభావాన్ని ఊసరవెల్లి లాగా ఎలా మారుస్తాడో ఈ పాట సాహిత్యం తెలుపుతుంది. అనంత శ్రీరామ్ ఈ పాట ను చక్కగా రచించాడు. ఫ్రాన్సిస్కో గాత్రం పాటకు మంచి అందాన్ని చేకూరుస్తుంది. దేవి శ్రీ సంగీతం బాగుంటుంది. ఈ పాట మంచి జనాదరణ పొందుతుంది.

విశ్లేషణ :

ఈ చిత్రం లో కొత్తదనం కోసం ప్రయత్నించం అని ఎన్.టి.ఆర్. ఆడియో వేదిక మీద చెప్పారు.ఈ చిత్రం పాటలు అదే విషయాన్నీ ద్రువీకరించుతాయి. ఇది ఎన్.టి.ఆర్. నుండి వచ్చే సాధారణమైన ఆడియో లాగా అనిపించదు. అటు క్లాస్ కు, ఇటు మాస్ కు కలిసొచ్చే లాగా చిత్రం ఆడియో తీర్చి దిద్ధబడింది. చిత్రీకరణకు మంచి అవకాసం ఉన్న ఈ పాటలు తెర మీద ఎలా ఉంటాయి అనేది వేచి చూడాలి.

– మహేష్.కె

సంబంధిత సమాచారం

తాజా వార్తలు